Begin typing your search above and press return to search.
పర్ఫెక్షన్ కోసం ప్రయత్నిస్తే బిరుసు అంటారా?
By: Tupaki Desk | 10 Feb 2020 3:30 AM GMTక్రియేటివ్ ఫీల్డ్ లో ఒక్కొక్కరికి ఒక్కో రకం చిక్కు తప్పదు. చెప్పింది విని బుద్ధిగా పని చేసుకుంటూ వెళ్లిపోతే మంచోళ్లు అంటూనే.. చేతకాని వాళ్లు అని కూడా అనేస్తారు. అదే చెప్పినదానికి సవరణలు చెబితే తల బిరుసు అంటూ విమర్శిస్తారు. ఈ తరహా సమస్యలు ఆర్టిస్టులకు ప్రతిసారీ ఎదురవుతూ ఉంటాయి. ఫలానా కాస్ట్యూమ్ బాలేదనో .. డైలాగ్ కిక్కివ్వలేదనో డైరెక్టుగా తమ అభిప్రాయాన్ని సూటిగా చెప్పలేని పరిస్థితి ఉంటుంది. పర్ఫెక్షనిస్టులకు ఇది మరింత చిక్కు తెచ్చి పెడుతుంటుంది. తమ మనసులో ఉన్నదానిని వెంటనే ఓపెన్ గా చెప్పేస్తే తలబిరుసే అని ప్రచారమైపోతుంది.
అయితే అలాంటి సమస్యల్ని కొత్త తరం స్టార్లు ఎదుర్కొంటూనే ఉంటారు. అయితే ఒకసారి నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యాక ఇక అదే కంటిన్యూ అయిపోతుంది. దానివల్ల కెరీర్ కి బోలెడత డ్యామేజీ తప్పదు. పరిశ్రమను అర్థం చేసుకునే లోపే బ్యాక్ టు ద పెవిలియన్ అన్నట్టే ఉంటుంది ఇక్కడ. అందుకే ఆర్టిస్టు ఎంతో ఒదిగి పని చేయాల్సి ఉంటుంది. ఒక ఆర్టిస్టుకి క్రియేటివిటీ పరంగా స్వేచ్ఛ ఎంత? ఎంతవరకూ ఇన్వాల్వ్ అవ్వొచ్చు. దర్శకులతో అభిప్రాయాల్ని పంచుకునే బార్డర్ ఎక్కడి వరకూ నిర్ణయించారు? అంటే ఎవరూ ఏమీ చెప్పలేరు. కొందరు దర్శకులు పాజిటివ్ గా తీసుకుంటే కొందరు దానినే నెగెటివ్ గా స్ప్రెడ్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు.
ఇదో మాయా ప్రపంచం. ఇక్కడ ఊహకు అందనివి ఎన్నో ఉంటాయి. అయితే కారణం ఏదైనా అందాల కేథరిన్ మాత్రం ఒకరకమైన అపప్రదను ఎదుర్కొంటోంది. ఉన్న మాటను ముక్కుసూటిగా చెప్పేసి అడ్డంగా బుక్కయిపోతోంది. ఇంతకుముందు మెగా స్టార్ సినిమాలో ఐటమ్ నంబర్ ఆఫర్ వస్తే.. కాస్ట్యూమ్స్ పరంగా ఫ్యాషన్ డిజైనర్ సుస్మిత కొణిదెలతో వాగ్వాదానికి దిగిందని దాంతో ఆ అవకాశమే కోల్పోవాల్సి వచ్చిందని ప్రచారమైంది. మెగా కాంపౌండ్ తిరస్కారం అంటే అది తనకు ఎంత పెద్ద మైనస్సో ఊహించగలిగేదే. పలు సందర్భాల్లో దర్శకనిర్మాతలతో వాగ్వాదానికి దిగిందని కొన్నిటిని వ్యతిరేకించిందని .. వెండితెరపై ఎమ్మెల్యేగా నటించిన కేథరిన్ నిజ జీవితంలోనూ అంతే పొగరుగా ఉంటుందని ప్రచారం చేసేశారు. అందువల్లే తనకు ఆఫర్లు తగ్గాయి.
అయితే వీటన్నిటికీ కాంట్రాస్ట్ గా కీ.శే దర్శకరత్న దాసరి నారాయణరావు తన సినిమా ఎర్రబస్సు(మంచు విష్ణు)లో నటించిన కేథరిన్ పై ప్రశంసలు కురిపించిన సందర్భాన్ని మర్చిపోలేం. కేథరిన్ కి పొగరెక్కువ అన్నారు. కానీ నాతో ఎంతో వినయంగా ఉంది. మంచి ప్రతిభావని అని పొగిడేశారు. ఇక కేథరిన్ నటించిన తాజా చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఏదో తెలిసీ తెలయక చేసిన తప్పుల్ని దిద్దుకునే అవకాశమే కేథరిన్ కి లేదా? ఉంటే గనుక అవకాశాలొస్తాయనే భావిద్దాం.