Begin typing your search above and press return to search.
కేథరిన్ కి ఇదే మొదటిసారి
By: Tupaki Desk | 9 May 2017 1:08 PM GMTమలయాళీ బ్యూటీ అయినా దుబాయ్ నుంచి వచ్చిన కేథరిన్ థ్రెసా.. ప్రస్తుతం తెలుగు- తమిళ భాషల్లో బాగానే చక్కర్లు కొడుతోంది. తను ఫిక్స్ అయిన విషయాలపై ఎలాంటి సమయంలోనూ తగ్గే అలవాటు లేని ఈ భామ కెరీర్.. ప్రస్తుతానికి బాగానే ఉందనే చెప్పాలి.
ఇద్దరమ్మాయిలతో.. సరైనోడు చిత్రాలతో టాలీవుడ్ ఆడియన్స్ ను ఆకట్టుకున్న ఈ భామ.. ప్రస్తుతం గోపీచంద్ సరసన ఓ సినిమాలో నటిస్తోంది. సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న గౌతమ్ నంద మూవీలో కోసం.. ఈ అమ్మడు తొలిసారిగా ఓ ప్రయోగం చేస్తోంది. ఈమూవీలో తనకు తానే డబ్బింగ్ చెప్పేసుకుంటోందట కేథరిన్ థ్రెసా. దుబాయ్ నుంచి వచ్చినా.. ఎక్కువ భాగం ఎడ్యుకేషన్ బెంగళూరులో పూర్తి చేయడంతో.. కేథరిన్ కు తెలుగుపై మంచి పట్టు ఉందట.
ఇన్నేళ్లూ భాషపై పర్ఫెక్షన్ లేకపోవడంతోనే డబ్బింగ్ చెప్పలేదని.. కానీ కొన్నేళ్లుగా తెలుగు సినిమాలు చేస్తుండడంతో ఇప్పుడు పర్ఫెక్ట్ గా మాట్లాడేస్తున్నానని.. అందుకే డబ్బింగ్ చెప్పుకోవాలనే నిర్ణయానికి వచ్చానని అంటోంది కేథరిన్ థ్రెసా.