Begin typing your search above and press return to search.
ఆ పత్రికను వాయించేసిన కేథరిన్
By: Tupaki Desk | 11 May 2016 3:30 PM GMTకేథరిన్ థ్రెసా గురించి ఎప్పుడూ మీడియాలో నెగెటివ్ వార్తలే వస్తుంటాయి. ఆమెకు చాలా పొగరని.. షూటింగ్ సందర్భంగా నిర్మాతల్ని ఇబ్బంది పెడుతుందని.. ప్రమోషన్ కార్యక్రమాలకు సమయానికి రాదని కూడా ఆమె మీద ఆరోపణలున్నాయి. అదే సమయంలో మీడియాతో కూడా ఆమె కొన్నిసార్లు చాలా కఠినంగా వ్యవహరించిన సందర్భాలున్నాయి. ఓసారి ప్రముఖ దిన పత్రిక ఆదివారం అనుబంధంలో ఆమె గురించి ఓ పత్రిక ఓ ఆర్టికల్ వేస్తే.. అందులో కొన్ని తప్పులున్నాయంటూ ఆమె స్పందించిన తీరుకు ఆ ఎడిటర్ అవాక్కయిపోయారు. మామూలుగా మీడియా వాళ్లతో సెలబ్రెటీలు సాఫ్ట్ గా డీల్ చేయడానికే ఇష్టపడతారు. లైట్ తీసుకోవాల్సిన విషయాలకు మరీ ఆవేశపడిపోరు.
ఐతే కేథరిన్ మాత్రం ఇలాంటి వ్యవహారాల్ని అస్సలు ఉపేక్షించేలా లేదు. మొన్నా మధ్య విజయవాడలో జరిగిన ‘సరైనోడు’ సక్సెస్ మీట్ సందర్భంగా వేదిక మీదికెక్కి కేథరిన్ సినిమాలోని కొన్ని డైలాగులు చెప్పింది. దీని మీద డెక్కన్ క్రానికల్ పత్రిక ఓ వార్త వేసింది. తాను పలికిన డైలాగులకు కేథరిన్ కు అర్థం తెలియదని.. ఏం మాట్లాడుతున్నానో తెలియకుండా ఏదేదో అనేసిందని ఆ వార్తలో వ్యాఖ్యానించారు.
వేరే హీరోయిన్ అయితే దీన్ని పెద్దగా పట్టించుకునేది కాదేమో. కానీ కేథరిన్ మాత్రం ఫేస్ బుక్ లో ఆ పత్రికకు రిటార్ట్ ఇస్తూ పెద్ద పోస్టే పెట్టింది. నా పనేంటో నాకు తెలియదా.. మీ నుంచి నేర్చుకోవాలి.. నేనేం మాట్లాడుతున్నానో తెలుసుకునే ఆ డైలాగులు చెప్పాను. ఇలాంటి స్టుపిడ్ వార్తలు రాస్తారా.. ఇదేనా జర్నలిజం అంటూ ఏకేసింది కేథరిన్. చివర్లో ఇలాంటి వార్తల్ని పట్టించుకోవద్దంటూ జనాలకు కూడా సూచన చేసింది. ఐతే కేథరిన్ మరీ అంత సీరియస్ అవ్వాల్సిన వ్యవహారమా ఇది అని జనాలకు డౌటొస్తోంది.