Begin typing your search above and press return to search.

వరల్డ్ ఫేమస్ లవర్ కు ఓకే చెబుతూ.. దర్శకుడ్ని ఏం కావాలంటే అలా చెప్పాడట

By:  Tupaki Desk   |   8 Feb 2020 3:20 PM IST
వరల్డ్ ఫేమస్ లవర్ కు ఓకే చెబుతూ.. దర్శకుడ్ని ఏం కావాలంటే అలా చెప్పాడట
X
ఒక సినిమాకు హీరోయిన్ ను ఓకే చేయించటం అంత తేలికైన విషయం కాదు. ఎన్నో సందేహాలు.. మరెన్నో అనుమానాలు.. ఇలా చాలా అంశాలపై చర్చ జరిగిన తర్వాతే సినిమాకు ఓకే చెప్పటం ఉంటుంది. పేరు ప్రఖ్యాతులున్న దర్శకుల చిత్రంలో పని చేసే అవకాశం లభిస్తే.. కొందరు నటీమణులు ఓకే చెప్పినా.. చాలామంది దర్శకుడు ఎవరైనా కావొచ్చు.. సినిమాలో తమ క్యారెక్టర్ ఏమిటన్న విషయం మీద వివరాలు తెలుసుకున్న తర్వాతే అంగీకరిస్తారని చెబుతారు.

నటి కేథరిన్ కు ఏదైనా సినిమాను ఓకే చేసే వేళ.. సదరు దర్శక నిర్మాత ను క్యాజువల్ గా కొన్ని ప్రశ్నలు అడగటం అలవాటు గా చెబుతారు. తాను అడిగిన ప్రశ్నలకు చెప్పే సమాధానాలతో ఆమె సినిమా చేయాలా? వద్దా? అన్నది డిసైడ్ చేసుకుంటారట. తాజాగా ఆమె నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రానికి ఓకే చెప్పే వేళలో.. ఈ చిత్రంలో తాను చేసే పాత్ర కోసం ఏమైనా ప్రత్యేకంగా తయారు కావాలా? కొత్తగా ఏదైనా ట్రై చేయాలా? అని అడిగిందట.

దానికి దర్శకుడు క్రాంతి బదులిస్తూ.. ప్రత్యేకంగా తయారు కావాల్సిందేమీ లేదని.. మీరు ఎలా ఉంటారో అలా ఉంటే చాలు.. సరి పోతుందని చెప్పారట. ఈ సినిమాలో ప్రత్యేక ఆకర్షణ కథేనని.. నటులంతా జస్ట్ కార్యెక్టర్లు మాత్రమేనని చెప్పింది. విజయ దేవరకొండ లాంటి హీరోతో పని చేసిన సినిమాను అలా సింపుల్ గా తేల్చేస్తే ఎలా కేథరిన్..?