Begin typing your search above and press return to search.
అందగత్తెతో దోబూచులాడుతున్న అదృష్టం
By: Tupaki Desk | 7 July 2021 5:30 PM GMTఅందానికి నిదర్శనాలు చూపడం .. నిర్వచనాలు ఇవ్వడం చాలా కష్టం. ఎందుకంటే ఎవరి అందం వారిది .. ఎవరి ప్రత్యేకత వారిది. ఒకరు కైపు కళ్లతో విన్యాసాలు చేస్తే .. మరొకరు సన్నజాజివంటి నడుముతో అలజడి రేపుతారు. హంసలాంటి సోయగంతో .. నెమలి నడకలతో పడుచు హృదయాలను అల్లుకుపోతారు. అలా అందాలతోనే బందీలుగా చేసే కథానాయికలలో ఒకరుగా కేథరిన్ కనిపిస్తుంది. పొద్దుతిరుగుడు పువ్వులా .. పొద్దే తెలియనీయాని ముద్దుగుమ్మలా తెరపై ఈ సుందరి అలరిస్తుంది. కావలసినంత అందం ఉన్నప్పటికీ అదృష్టం ఈ పిల్లతో దోబూచులాడుతోంది.
కేథరిన్ లో ప్రత్యేకమైన ఆకర్షణగా ఆమె కళ్లు కనిపిస్తాయి. కనురెప్పల మధ్య దాగిన కాంతిపుంజంలా ఆమె కళ్లు ఉంటాయి. చిలిపి భావాలను నిక్షిప్తం చేసిన ఖజనాలను అవి గుర్తుకు చేస్తాయి. సాధారణంగా వలవేస్తే చేపపిల్లలు చిక్కుకుంటాయి .. కానీ చేపపిల్లల వంటి ఆమె కళ్లే వలలు విసరడం విశేషం. ఆ కంటి కిరణాలు సోకితే ఇలలో ఇంటికో దేవదాసు తయారు కావడం ఖాయమనిపిస్తుంది. అలాంటి కేథరిన్ తెలుగు తెరకు 'ఇద్దరమ్మాయిలతో' సినిమా ద్వారా పరిచయమైంది. తెరపై ఈ అమ్మాయిని చూసినవాళ్లు 'ఇంత గొప్ప అందగత్తెను ఇంత ఆలస్యంగానా చూపించడం' అని చాలా ఫీలైపోయారట.
యూత్ అంతా ఈ అమ్మాయి జపం చేస్తూ ఉండటం .. నోట్ బుక్స్ లో ఆమె పేరును అదే పనిగా రాస్తూ ఉండటంతో, వరుస అవకాశాలు వచ్చాయి. వాటిలో 'సరైనోడు' .. 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాలు మాత్రమే కేథరిన్ కి మంచి పేరును తెచ్చిపెట్టాయి. ఇక 'వరల్డ్ ఫేమస్ లవర్'లో స్మిత పాత్రలోను ఈ అమ్మాయి అందాల సుగంధాలను వెదజల్లింది. బొగ్గుగనుల నేపథ్యంలో నడిచే కథలో ఆమె వజ్రంలా మెరిసింది .. గుండెవాకిట్లో గులాబీలా విరిసింది.
తనకి గల గ్లామర్ తో .. నటనతో పోల్చుకుంటే, ఈ అమ్మాయికి ఇంకా సరైన సినిమా పడనే లేదు అనిపిస్తుంది. ఆమెను గుర్తించడంలో ఆలస్యం జరుగుతుందనే ఆవేదన అభిమానుల్లో కనిపిస్తుంది. ప్రస్తుతం ఆమె చేతిలో 'భళా తందనాన' .. 'బింబిసార' అనే రెండు సినిమాలు కనిపిస్తున్నాయి. ఈ రెండు సినిమాలపై ఆమె గట్టిగానే ఆశలు పెట్టుకుంది. ఈ ఏడాదిలోనే ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మరి ఈ సినిమాలైనా అభిమానులు కోరుకునే స్థాయికి ఆమెను తీసుకెళతాయేమో చూడాలి.