Begin typing your search above and press return to search.
క్యాలీఫ్లవర్ లుక్.. తెల్లదొరలా దిగిన సంపూ సంపుడే!
By: Tupaki Desk | 9 May 2021 7:30 AM GMTహృదయకాలేయం- కొబ్బరిమట్ట లాంటి ఎరోటిక్ కామెడీ చిత్రాలతో టాలీవుడ్ లో సంచలనాలు సృష్టించిన సంపూర్ణేష్ బాబు వరుసగా ఒకదానివెంట ఒకటిగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఇటీవల క్రైసిస్ లో కొన్ని రిలీజ్ లు ఆలస్యమవుతున్నాయి కానీ ఈపాటికే అతడి నుంచి ఒకట్రెండు సినిమాలు రిలీజ్ కి రావాల్సి ఉంది.
బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ఈసారి మరో ప్రయోగంతో దూసుకొస్తున్నాడు. అతడి గెటప్ అసాధారణంగా ఉంటుందని తాజాగా రిలీజైన ఫస్ట్ లుక్ చెబుతోంది. నేడు సంపూ బర్త్ డే సందర్భంగా కెరీర్ ఐదో సినిమా `క్యాలీఫ్లవర్` లుక్ లాంచ్ అయ్యింది. క్లాలీఫ్లవర్ కే తాతలా దిగాడు అతడు. గుర్రంపై సంపూ దూసుకొస్తున్న ఈ విజువల్ మైండ్ బ్లాక్ చేస్తోంది. గాంధీజీ స్వాతంత్య్రం తెస్తే.. సర్ అర్ధర్ కాటన్ బ్యారేజీ నిర్మిస్తే.. భారతదేశ మహిళల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటడానికి ఇంగ్లండ్ నుంచి దిగాడు ఈ క్యాలీఫ్లవర్!!
ఫస్ట్ లుక్ పోస్టర్ లో సంపూర్ణేష్ బాబు తెల్లదొర (ఆంగ్లేయుడి)గా పరిచయమయ్యారు. మొదటి బ్యాంగ్ వీడియోలో భారతీయ మహిళా స్వచ్ఛత గురించి ప్రపంచానికి తెలియజేసేందుకు ఇంగ్లాండ్ నుండి భారతదేశానికి వచ్చే వ్యక్తిగా అతడి అభినివేశం ఆకట్టుకుంది. ఇది పూర్తి కామెడీ ఎంటర్ టైనర్. ఆర్.కె.మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. గోపి కిరణ్ ఈ కథను రాయగా.. మధుసూధన క్రియేషన్స్ - రాధాకృష్ణ టాకీస్ బ్యానర్ లలో ఆశా జ్యోతి గోగినేని నిర్మిస్తున్నారు. శ్రీధర్ గూడూరు ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు.
సంపూ సరసన వసంత కథానాయికగా నటిస్తున్నారు. పోసాని కృష్ణ మురళి- పృథ్వీ- నాగ మహేష్- గెటప్ శ్రీను- రోహిణి-కాదంబరి కిరణ్- కల్లు కృష్ణారావు తదితరులు తారాగణం. ప్రజ్వాల్ క్రిష్ సంగీతం అందిస్తుండగా.. ముజీర్ మాలిక్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ చిత్రం షూట్ ఇటీవల ప్రారంభమైంది.

Presenting you 'Burning Star' @sampoornesh as the Grand Father of #