Begin typing your search above and press return to search.
ట్రైలర్: శీలాన్ని కాపాడే సింబలే 'క్యాలీఫ్లవర్'
By: Tupaki Desk | 20 Nov 2021 5:38 AM GMTబర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం ''క్యాలీఫ్లవర్''. ‘శీలో రక్షతి రక్షిత:’ అనే ఉపశీర్షికతో అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఆర్కే మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంపూ సరసన వాసంతి హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - టీజర్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. నవంబర్ 26న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో విభిన్నమైన ప్రమోషనల్ కార్యక్రమాలతో దూసుకుపోతున్న చిత్ర బృందం.. తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేసింది.
సంపూర్ణేష్ బాబు శైలికి తగ్గట్లుగా సాగే విభిన్నమైన వినోదాత్మక కథాంశంతో 'క్యాలీఫ్లవర్' సినిమా రూపొందిందని ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. జంతువుకైనా మనుషులకైనా ఒకే భార్య ఒకే భర్త అనే సిద్ధాంతంతో తన గ్రామ ప్రజల శీలాలను కాపాడే క్యాలీ ఫ్లవర్.. పెళ్లి తర్వాత తన శీలాన్నే పోగొట్టుకున్నాడు. తనకు జరిగిన అన్యాయంపై క్యాలీ ఫ్లవర్ చేసిన పోరాటమే ఈ సినిమా అని తెలుస్తోంది.
సంపూర్ణేష్ బాబు అసెంబ్లీ ముందు ధర్నా చేయడం చూస్తుంటే.. మగాడి శీలం కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలనే లక్ష్యంతో క్యాలీ ఫ్లవర్ పోరాటం చేయనున్నాడని అర్థం అవుతుంది. శీలం ఆడాళ్లకే కాదు.. మగాళ్ల శీలానికి కూడా విలువ ఉంటుందనే విభిన్నమైన కాన్సెప్టుతో ఆద్యంతం కడుపుబ్బా నవ్వించేలా ఈ సినిమాని తీశారని తెలుస్తోంది. చివర్లో ఇంగ్లీష్ దొరబాబు గెటప్ లో కనిపించి ఇందులో మరో పాత్ర ఉంటుందని హింట్ ఇచ్చారు.
పోసాని కృష్ణ మురళి - పృథ్వీ - నాగ మహేష్ - గెటప్ శ్రీను - రోహిణి - కాదంబరి కిరణ్ - కల్లు కృష్ణారావు - విజయ్ - కళ్యాణి - సుమన్ మన్వాడ్ - ముస్కాన్ - బేబీ సహ్రుదా - రమణ్ దీప్ కౌర్ 'క్యాలీ ఫ్లవర్' చిత్రంలో ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ప్రజ్వల్ క్రిష్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ముజీర్ మాలిక్ సినిమాటోగ్రఫీ అందించగా.. బాబు ఎడిటింగ్ వర్క్ చేశారు. గూడురు శ్రీధర్ సమర్పణలో మధుసూధన క్రియేషన్స్ - రాధాకృష్ణ టాకీస్ పతాకాలపై ఆశా జ్యోతి గోగినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. 'హృదయ కాలేయం' 'సింగం 123' 'కొబ్బరిమట్ట' వంటి చిత్రాలతో అలరించిన సంపూ.. 'క్యాలీఫ్లవర్' తో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.