Begin typing your search above and press return to search.
పద్మావతి కోసం రంగంలోకి ప్రొఫెసర్లు
By: Tupaki Desk | 29 Dec 2017 4:41 AM GMTబాలీవుడ్ మూవీ పద్మావతి విషయంలో వివాదం సంగతి జనాలకు తెలిసిందే. అయితే.. జనవరి 1న విడుదల కావాల్సిన ఈ సినిమా.. ఇంకా థియేటర్లలోకి రాకపోవడంతో కాంట్రవర్సీ కంటిన్యూ అవుతూనే ఉంది. పిక్చరైజేషన్ తో పాటు.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు.. ప్రమోషన్ యాక్టివిటీస్ కూడా చేపట్టినా.. ఇప్పటివరకూ పద్మావతికి సెన్సార్ తతంగం మాత్రం పూర్తి కాలేదు.
గతంలో సెన్సార్ కోసం పంపిన దరఖాస్తు సరిగా లేదని చెప్పాయి బోర్డ్ వర్గాలు. తీరా ఇప్పుడు అన్నిరకాలుగా సరైన ఫార్మాట్ లోనే సెన్సార్ ముంగిట వచ్చి వాలింది పద్మావతి. కానీ ఇప్పటికే వివాదాస్పదం అయిన ఈ చిత్రానికి సర్టిఫికేట్ అందించే విషయంలో.. ఆచి తూచి వ్యవహరించాలని డిసైడ్ అయింది సెన్సార్ బోర్డ్. అందుకే సెన్సార్ సభ్యులతో పాటు.. ఇద్దరు ప్రొఫెసర్లను కూడా మూవీని చూసేందుకు ఆహ్వానించారు. రాజస్థాన్ కు చెందిన ఇద్దరు సీనియర్ ప్రొఫెసర్లకు ఇప్పటికే పిలుపు అందింది కూడా.
ఓ కాలేజ్ ప్రిన్సిపాల్ ఆర్.ఎస్.కంగరాట్.. రాజస్థాన్ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ బి.ఎల్. గుప్తా.. వీరిద్దరూ పద్మావతి చూసి.. మూవీలోని అంశాలను పరిశీలించాల్సిందిగా.. సెంట్రల్ సెన్సార్ బోర్డ్ చీఫ్ ప్రసూన్ జోషి నుంచి స్వయంగా పిలుపు అందింది. రాజపుత్ వంశానికి చెందిన పద్మావతి కథను తప్పుదోవ పట్టించారన్నదే ఈ సినిమాపై వస్తున్న ప్రధాన ఆరోపణ. అసలు ఈ చిత్రాన్ని విడుదల కానివ్వబోమని.. రాజ్ పుత్ కర్ణి సేన ఇప్పటికీ హెచ్చరిస్తూనే ఉంది.