Begin typing your search above and press return to search.

ఆ సినిమాకు 45 కట్స్ ఇచ్చారు

By:  Tupaki Desk   |   19 Sep 2017 5:14 PM GMT
ఆ సినిమాకు 45 కట్స్ ఇచ్చారు
X
ప్రహ్లాద్ నిహ్లాని సెన్సార్ బోర్డు ఛైర్మన్ గా ఉన్న సమయంలో కొన్ని సినిమాలకు భారీ స్థాయిలో కోతలు వేయడం తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఐతే అతను దిగిపోయి ప్రసూన్ జోషి పగ్గాలందుకోవడంతో సెన్సార్ బోర్డు తీరు మారుతుందని.. ఫిలిం మేకర్స్ కు కొంచెం స్వేచ్ఛ వస్తుందని.. అడల్ట్ కంటెంట్ విషయంలో కొంచెం లిబరల్ గా ఉంటారని భావించారు ఇండస్ట్రీ జనాలు. ఐతే ఇప్పుడు కూడా కొన్ని సినిమాలకు సెన్సార్ బోర్డు నుంచి తీవ్ర ఇబ్బందులే ఎదురవుతున్నాయి. ప్రసూన్ జోషి సెన్సార్ బోర్డు ఛైర్మన్ కాగానే ఆయన రివ్యూ చేసిన తొలి సినిమా ‘తూఫాన్ సింగ్’ను పూర్తిగా నిషేధించడం తెలిసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో సినిమాకు సెన్సార్ బోర్డు భారీగా కోతలు విధించింది.

‘లవ్ సోనియా’ అనే సినిమాకు ఏకంగా 45 కట్స్ ఇచ్చి.. ‘ఎ’ సర్టిఫికెట్ జారీ చేసిందట సీబీఎఫ్సీ. బాలల అక్రమ రవాణా.. మహిళల్ని విదేశాలకు తరలించే ముఠాల అక్రమాల నేపథ్యంలో దర్శకుడు తాబ్రేజ్ నూరానీ ‘లవ్ సోనియా’ సినిమాను రూపొందించాడు. ఐతే సినిమాను వాస్తవికంగా తెరకెక్కించే క్రమంలో చాలా సన్నివేశాల్ని పచ్చిగా తీశారట. మాటల్లో కూడా బూతులు బాగా ఎక్కువయ్యయట. దీంతో సెన్సార్ బోర్డు ఏకంగా 45 సన్నివేశాలకు కోత విధించిందట. దీంతో సినిమా గమనమే దెబ్బ తిందని.. రూపమే మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తోంది చిత్ర బృందం. ఇంతకుముందు ‘ఉడ్తా పంజాబ్’.. ‘బాబూ మషాయ్ బందూక్ బాజ్’.. ‘ఇందు సర్కార్’ లాంటి సినిమాలకు కూడా సెన్సార్ బోర్డు ఇలాగే భారీ స్థాయిలో కోతలు విధించింది.