Begin typing your search above and press return to search.
'CBI 5: ది బ్రెయిన్' ట్రైలర్: మర్డర్ మిస్టరీని మెగాస్టార్ చేధించగలడా..?
By: Tupaki Desk | 22 April 2022 4:57 PM GMTమలయాళ మెగాస్టార్ మమ్ముట్టి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. డబ్బింగ్ సినిమాలతో టాలీవుడ్ లో కూడా క్రేజ్ ఏర్పరచుకున్న సీనియర్ హీరో.. 'సూర్య పుత్రులు' 'స్వాతి కిరణం' 'యాత్ర' వంటి స్ట్రెయిట్ తెలుగు సినిమాల్లో నటించారు. ఇటీవల 'భీష్మ పర్వం' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న మమ్ముట్టి.. ఇప్పుడు ''CBI 5: ది బ్రెయిన్'' అనే చిత్రంతో వస్తున్నారు.
''సీబీఐ 5 : ది బ్రైన్'' చిత్రానికి కె. మధు దర్శకత్వం వహించారు. స్వర్గచిత్ర బ్యానర్ పై అప్పచ్చన్ నిర్మించారు. ఇది CBI సిరీస్ లో ఐదవ చిత్రం. ఇందులో సిబిఐ ఆఫీసర్ సేతురామ అయ్యర్ గా మమ్ముట్టి కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో రిలీజ్ కు రెడీ అయిన ఈ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ట్రైలర్ ను మేకర్స్ ఆవిష్కరించారు.
ఒక మర్డర్ మిస్టరీ కేసు ఇన్వెస్టిగేషన్ లో పోలీసులు విఫలం అవడంతో.. దాన్ని ఛేదించడం కోసం సీబీఐ ఆఫీసర్ సేతురామయ్యర్ రంగంలోకి దిగాడు. ఆ మర్డర్స్ ఎవరు చేశారు? ఎందుకు చేశారు? తన తెలివితేటలతో కథానాయకుడు ఆ కేసును ఎలా చేధించాడు? అన్నదే ఈ సినిమా కథాంశమని ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది.
ఇప్పటి వరకు సిబిఐ సిరీస్ లో వచ్చిన 'ఒరు సిబిఐ డైరీ కురిప్పు' (1988) - 'జాగ్రత్త' (1989) - 'సేతురామ అయ్యర్ CBI' (2004) - 'నేరరియాన్ CBI' (2005) వంటి చిత్రాలు మంచి విజయం సాధించాయి. దాదాపు పదిహేడేళ్ళ తర్వాత ఈ సిరీస్ లో ఐదో చిత్రంగా ''CBI 5: ది బ్రెయిన్'' ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
గత చిత్రాలకు కథలు అందించిన యస్.యన్. స్వామి ఈ సినిమాకు కూడా స్టోరీ అందించారు. జేక్స్ బిజాయ్ దీనికి సంగీతం సమకూర్చారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేశారు. ఈ సినిమాలో ముఖేశ్ - జగతిశ్రీ కుమార్ - సాయికుమార్ - అనూప్ మీనన్ - ఆశా శరత్ - అన్సిబా హసన్ - మాళవికా నాయర్ - మాళవికా మీనన్ - గణేశ్ కుమార్ - సంతోష్ కీళత్తూర్ - రంజీ ఫణిక్కర్ - సౌబిన్ షాహిర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
'సీబీఐ 5 : ది బ్రెయిన్' చిత్రాన్ని రంజాన్ సీజన్ లో 2022 మే 1న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల చేయబోతున్నారు. లేటెస్టుగా వచ్చిన ట్రైలర్ సినిమాపై అంచనాలు కలిగించింది. మరి ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో.. మమ్ముట్టికి ఏ స్థాయిలో పేరు తెచ్చిపెడుతుందో చూడాలి.