Begin typing your search above and press return to search.
సుశాంత్ కేసు: దిశా బాయ్ ఫ్రెండ్ ప్లాట్ కి ఇన్వెస్టిగేషన్ టీమ్...?
By: Tupaki Desk | 15 Oct 2020 2:30 PM GMTబాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి కేసులో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. జూన్ 8న సుశాంత్ మాజీ మేనేజర్ దిశా సలియాన్ ఆత్మహత్య చేసుకున్న తర్వాత.. జూన్ 14న సుశాంత్ విగతజీవిగా కనిపించడం అనేక అనుమానాలు కలిగించింది. దిశా ముంబైలోని మలద్ ప్రాంతంలో తాను నివాసం ఉండే అపార్ట్మెంట్ పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో సుశాంత్ మృతికి దిశా సలియన్ సూసైడ్ కి ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో అనుమానాలు రేకెత్తాయి. అయితే ఇప్పుడు నేషనల్ ఛానల్ రిపబ్లిక్ టీవీ కథనం ప్రకారం.. దిశా బాయ్ ఫ్రెండ్ రోహన్ రాయ్ ని ఐదుగురు ఇన్వెస్టిగేషన్ టీమ్ విచారించారని తెలుస్తోంది.
కాగా, సుశాంత్ - దిశా మరణాలకు సంబంధం ఉందని భారతీయ జనతా పార్టీ నాయకుడు నితేష్ రాణే కూడా అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో దిశ మరణంపై మీడియాలో వరుస కథనాలు ప్రసారం అయ్యాయి. దీంతో దిశ తండ్రి సతీష్ సలియాన్ తన ఫ్యామిలీని మానసిక వేధింపులకు గురి చేస్తున్నారంటూ పోలీసులకు లేఖ రాశారు. తమ కుటుంబంపై జరుగుతున్న మానసిక వేధింపుల గురించి.. మరణించిన తన కుమార్తెకు సంబంధించి మీడియా మరియు జర్నలిస్టులు వ్యవహరిస్తున్న తీరు బాధిస్తోందని తెలిపారు. అప్పటి నుంచి దిశా మరణంపై పెద్దగా కథనాలు వెలువడలేదు. సుశాంత్ కేసులో సీబీఐ దర్యాప్తు చేయడంతో ఈ రెండు కేసుల్లో లింక్స్ బయటపడే అవకాశం ఉందని అందరూ అనుకున్నారు.
ఈ నేపథ్యంలో ఐదుగురు ఇన్వెస్టిగేషన్ రోహన్ రాయ్ ని విచారించడానికి మలద్ లోని దిశా సూసైడ్ చేసుకున్న ప్లాట్ కి వచ్చారని సెక్యూరిటీ గార్డ్ చెప్పినట్లు రిపబ్లిక్ టీవీ పేర్కొంది. ఫ్లాట్ కి వచ్చిన వాళ్ళు గంటకు పైగా ఉన్నారని.. వాళ్ళు పోలీసులు వలె కనిపించలేదని గార్డ్ చెప్పినట్లు తెలిపింది. అక్కడ ఏమి జరిగిందో ఇంకా క్లారిటీ లేనప్పటికీ వాళ్ళు కొన్ని ఫోరెన్సిక్ ఆధారాలను సేకరించడానికి వచ్చారని జాతీయ ఛానల్ తెలిపింది. ఇంతకముందు సుశాంత్ ఫ్రెండ్ యువరాజ్ సింగ్ ఈ కేసులో అన్ని విషయాలపై క్లారిటీ రావాలంటే సిబిఐ దిశా బాయ్ ఫ్రెండ్ రోహన్ రాయ్ ను పట్టుకుని నార్కో ఎనాలిసిస్ టెస్ట్ చేయాలని వారితో చెప్పినట్లు రిపబ్లిక్ టీవీ వెల్లడించింది.