Begin typing your search above and press return to search.

సుశాంత్‌ : ఉద్యమంలో 13 దేశాల అభిమానులు

By:  Tupaki Desk   |   17 Aug 2020 3:30 PM GMT
సుశాంత్‌ : ఉద్యమంలో 13 దేశాల అభిమానులు
X
బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ రాజ్‌ పూత్‌ మృతి పై ఉన్న పలు అనుమానాలను నివృత్తి చేసేందుకు ఆయన కుటుంబ సభ్యులు మరియు అభిమానులు సీబీఐ ఎంక్వౌరీని డిమాండ్‌ చేస్తున్న విషయం తెల్సిందే. సుశాంత్‌ మృతి తర్వాత జరిగిన పరిణామాలు చూస్తే బాలీవుడ్‌ ప్రముఖులపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కనుక ఈ కేసును ఖచ్చితంగా సీబీఐకి అప్పగించాల్సిందే అంటూ సుశాంత్‌ కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు. ముఖ్యంగా సుశాంత్‌ సోదరి శ్వేత సింగ్‌ సోషల్‌ మీడియా ద్వారా ఒక ఉద్యమమే మొదలు పెట్టారు.

#CBIForSSR అనే హ్యాష్‌ ట్యాగ్‌ ను పోస్ట్‌ చేసిన ఆమెకు బాలీవుడ్‌ కు చెందిన కంగనా రనౌత్‌ అంకితా లోఖండే అనుపమ్‌ కేర్‌ వంటి కొందరు స్టార్స్‌ మద్దతు దక్కింది. దాంతో ఆ హ్యాష్‌ ట్యాగ్‌ ఉద్యమం అంతర్జాతీయ స్థాయికి చేరింది. కేవలం నాలుగు రోజుల్లోనే ఆ హ్యాష్‌ ట్యాగ్‌ ను దాదాపుగా 30 లక్షల మంది ట్వీట్స్‌ చేశారు. అయితే ఇండియన్‌ అభిమానులతో పాటు వివిధ దేశాల్లో ఉన్న వారు కూడా ఈ హ్యాష్‌ ట్యాగ్‌ తో ట్వీట్‌ చేయడం చర్చనీయాంశంగా మారింది.

ప్రధానంగా 13 దేశాల నుండి ఈ హ్యాష్‌ ట్యాగ్‌ తో ట్వీట్స్‌ నమోదు అయ్యాయి. ఇండియాలో 12 లక్షలకు పైగా ట్వీట్స్‌ నమోదు అవ్వగా అమెరికాలో 5 లక్షల ట్వీట్స్‌ పడ్డాయి. ఆస్ట్రేలియా నుండి రెండు లక్షల ట్వీట్స్‌ కెనడా నుండి 1.6 లక్షల ట్వీట్స్‌ ను చేసినట్లుగా ట్రేడ్‌ ఎనలిస్ట్‌ లు చెబుతున్నారు. ఈ నెంబర్స్‌ చూస్తుంటే సుశాంత్‌ కు ఉన్న అభిమాన బలం ఎంతో తెలిసి పోతుంది.

ఇంత మంది అభిమానుల అభిమానం పొందిన ఆయన త్వరగా మృతి చెందడం ఆయన దురదృష్టం అంటూ నెటిజన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సుశాంత్‌ కేసు సీబీఐకి అప్పగించాలంటూ ప్రజల నుండి వస్తున్న విజ్ఞప్తి నేపథ్యంలో కేసు విషయంలో మరింత సీరియస్‌ గా వ్యవహరించే అవకాశం ఉందంటున్నారు.