Begin typing your search above and press return to search.
డ్రగ్స్ కేసు: సంజన గల్రానీతో సినిమా తీసిన నిర్మాతలని విచారించిన సీసీబీ..!
By: Tupaki Desk | 22 Oct 2020 5:38 PM GMTకన్నడ చిత్ర సీమలో వెలుగులోకి డ్రగ్స్ వినియోగం, సరఫరా కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. శాండిల్ వుడ్ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులకు సంబంధాలు ఉన్నట్లు గుర్తించిన బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే హీరోయిన్లు సంజనా గల్రానీ - రాగిణి లను అరెస్ట్ చేసిన సీసీబీ అధికారులు.. వారితో ఆర్థిక లావాదేవీలు జరిపిన వారందరినీ విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సంజనాతో ఆర్థిక లావాదేవీలు జరిపిన ప్రముఖ రాజకీయ నాయకుడి కొడుకు మరియు సినీ నిర్మాత దంపతులను సీసీబీ విచారించినట్లు మీడియా వర్గాలు వెల్లడించాయి.
డ్రగ్స్ కేసులో అరెస్టు కాబడిన సంజనాకి కర్ణాటక కాంగ్రెస్ పార్టీ నాయకుడు యుబి. వెంకటేశ్ కుమారుడు గణేష్ రావ్ కు లింక్ ఉన్నట్లు సీసీబీ గుర్తించిందని తెలుస్తోంది. సంజనా బ్యాంక్ అకౌంట్ ల నుంచి వ్యాపారవేత్త అయిన గణేష్ రావ్ బ్యాంకు ఖాతాలకు లక్షల రూపాయలు నగదు బదిలీ అయినట్లు పోలీసులు గుర్తించారట. ఈ క్రమంలో గణేష్ కు బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసు అధికారులు సమన్లు జారీ విచారించారు. వీరిద్దరి మధ్య ఎందుకు ఆర్థిక లావాదేవీలు జరిగాయనే విషయంపై ప్రశ్నించి వివరాలు సేకరించారని సమాచారం.
అలానే సంజనాతో 'రామ్ లీలా' అనే సినిమాను నిర్మించిన నిర్మాత సౌందర్య జగదీష్ దంపతులను కూడా సీసీబీ విచారించినట్లు తెలుస్తోంది. విచారణ తరువాత మీడియాతో మాట్లాడిన సౌందర్య జగదీష్ దంపతులు 'రామ్ లీలా సినిమాకు మీరు సంజనా గల్రానీకి ఎంత పారితోషికం చెల్లించారని మాత్రమే మమ్మల్ని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ప్రశ్నించారని.. వేరే విషయాలేమీ అడగలేద'ని చెప్పారు. దీంతో జైల్లో ఉన్న నటి సంజనాతో సన్నిహితంగా ఉండే అందరూ సీసీబీ ఎప్పుడు ఎవరిని పిలిచి విచారణ చేస్తారో అని ఆందోళన పడుతున్నారని తెలుస్తోంది.