Begin typing your search above and press return to search.

టీవీ నటి ఆత్మహత్య కేసులో కీలకంగా మారిన సీసీ ఫుటేజ్..!

By:  Tupaki Desk   |   28 Dec 2022 10:30 AM GMT
టీవీ నటి ఆత్మహత్య కేసులో కీలకంగా మారిన సీసీ ఫుటేజ్..!
X
టీవీ నటి తునీషా శర్మ ఆత్మహత్య కేసులో రోజుకో సంచలన విషయం బయటికొస్తుంది. అలీబాబా దస్తాన్ ఏ కాబుల్ షో షూటింగ్ స్పాట్ లోని తన సహచర నటుడి మేకప్ రూంలో తునీషా శర్మ ఉరి వేసుకొని మృతి చెందడం సంచలనంగా మారింది. తునీషా శర్మ మరణవార్త బాలీవుడ్.. టెలివిజన్ రంగాన్ని ఒక్క కుదుపు కుదిపివేసింది.

తునీషా శర్మ తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ కేసులో తొలి నుంచి తునీషా శర్మ మాజీ ప్రియుడు షీజాన్ ఖాన్ పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాలుగు రోజుల పాటు పోలీసుల రిమాండ్ లో ఉన్న షీజాన్ ఖాన్ తరుచూ మాట మారుస్తున్నాడని తెలుస్తోంది.

పోలీసులు విచారణలో తునీషా శర్మను తలుచుకొని ఆమె ప్రియుడు పలుమార్లు బోరున విలపించాడు. ఆమె అంత్యక్రియలకు హాజరు కావాలని ఉందని షీజాన్ కోరినట్లు పోలీసులు తెలిపారు. శ్రద్ధావాకర్ హత్య అనంతరం తమ రిలేషన్లో బ్రేకప్ వచ్చిందని షీజాన్ ఖాన్ చెప్పడం అతడిపై మరింత అనుమానాన్ని పెంచేలా చేస్తుంది.

తమ కులాలు.. మతాలు వేర్వురు కావడం వల్ల భవిష్యత్ లో ఇబ్బందులు వస్తాయని ఆమెకు బలవంతంగా బ్రేకప్ చెప్పినట్టు షీజాన్ ఖాన్ పోలీసుల దర్యాప్తు వెల్లడించారు. అయితే ఒకసారి చెప్పిన మాట మరోసారి దానిని ధృవీకరించడం లేదని పోలీసులు చెబుతున్నారు. ఈక్రమంలోనే తునీషా శర్మను షీజాన్ ఖాన్ హాస్పిటల్ కు తరలిస్తున్న సీసీటీవీ ఫుటేజ్ బయటికి రావడంతో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

తునీషా శర్మ షూటింగ్ స్పాట్లోని ఓ గదిలో బందించుకొని ఆత్మహత్య చేసుకోగా తలుపులు పగులగొట్టి ఆమెను బయటికి తీశారు. అయితే ఆమెను హాస్పిటల్ కు తరలించే క్రమంలో తునీషాను కేవలం షీజాన్.. మరికొరు మాత్రమే తీసుకెళ్లారు. షూటింగ్ నిర్వాహకులెవరు కూడా ఆమె వెంట వెళ్లిన దాఖలాలు లేవని తెలుస్తోంది.

ఇక హాస్పిటల్ గేట్ వద్ద సీసీ టీవీ ఫుటేజ్ లో షీజాన్ ఖాన్ తన చేతుల్లోకి తునీషా శర్మను ఎత్తుకొని వెళ్లినట్లు రికార్డయ్యాయి. మరో వ్యక్తి ఆమెను కారులోంచి దించుతున్నట్లు కన్పించాయి. అయితే ఆమె హస్పటల్ కు వెళ్లే వరకు కూడా బ్రతికే ఉందా? లేదంటే మరణించిందా? అనేది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ కేసు ప్రస్తుతం రాజకీయ రంగు పులుముకుంది. తునీషా శర్మ మరణానికి లవ్ జిహాదీనే కారణమని బీజేపీ నేతలు ఆరోపిస్తుండటం సంచలనంగా మారింది. దీంతో ఈ కేసు అనేక మలుపులు తిరుగుతూ వెళుతోంది. పోలీసుల ప్రాథమిక విచారణలో ఈ కేసుకు లవ్ జిహాదికి సంబంధం లేదని వెల్లడైందని పోలీసులు చెబుతున్నారు. మున్ముందు ఈ కేసు ఎన్ని మలుపులు తీసుకుంటుందో వేచిచూడాల్సిందే..!


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.