Begin typing your search above and press return to search.
పవర్ స్టార్ `వకీల్ సాబ్` ట్రైలర్ పై ప్రముఖులేమన్నారు?
By: Tupaki Desk | 30 March 2021 4:42 AM GMTపవర్ స్టార్ పవన్ కల్యాణ్ `వకీల్ సాబ్` చిత్రంతో రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. జనసేనానిగా రాజకీయాల్లోకి వెళ్లి కొంత విరామం తర్వాత తిరిగి ఆయన వస్తున్నారు! అనగానే అభిమానుల్లో ఒకటే ఉత్కంఠ. ఆ ఉత్కంఠకు తగ్గట్టే అద్భుతమైన కంటెంట్ ఉన్న పింక్ రీమేక్ కథాంశాన్ని ఎంచుకోవడం సరైన నిర్ణయమని తాజాగా రిలీజైన వకీల్ సాబ్ ట్రైలర్ చెబుతోంది.
మగువల విషయంలో ఓ సున్నిత అంశం చుట్టూ తిరిగే ఈ కథాంశంలో వకీల్ సాబ్ రోల్ చాలా ఆసక్తిని రేకెత్తించింది. అన్యాయం అయిపోయిన అతివలపై కోర్ట్ డ్రామాలో ఎమోషన్ పీక్స్ కి చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆడాళ్లలో ఎమోషన్ రగిలించి ఈ సినిమా థియేటర్లకు రప్పించే వీలుందని సమీక్షకులు విశ్లేషించారు. ఓవరాల్ గా ట్రైలర్ పవన్ అభిమానులతో పాటు సామాన్య జనంలోకి దూసుకెళ్లింది. పవన్ ఫస్ట్ ఇంప్రెషన్ కొట్టేశారు. ట్రైలర్ పై పరిశ్రమ ప్రముఖులంతా అద్బుత రివ్యూలిచ్చారు. ఎవరి సమీక్ష ఎలా ఉందో పరిశీలిస్తే..
``సరైన వ్యక్తి సరైన సైడ్ ఉంటే అల్టిమేట్ గా న్యాయం జరుగుతుంది`` అంటూ నిర్మాత బోనికపూర్ చేసిన ట్వీట్ ఆకట్టుకుంది. మెగా మేనల్లు సాయి తేజ్ చాలా ఎగ్జయిట్ అయ్యారు. కళ్యాణ్ మామ డైలాగ్ ని చెప్పారు. ఏం న్యాయం నందాజీ? కూర్చోండి చాలు! అన్న డైలాగ్ తో ప్రశంసించారు. పవన్ కల్యాన్ మామను తెర మీద అలా చూడటానికి కళ్లు చాలలేదు! అంటూ సాయి తేజ్ ట్వీట్ చేశారు. పవర్ ఫుల్ పాత్రచిత్రణతో వకీల్ సాబ్ ట్రైలర్ బావుంది. పవర్ స్టార్ పవర్ ఫుల్ పాత్ర.. ఆయన యాటిట్యూడ్ ప్రధాన ఆయుధాలు.. ఎప్పుడెప్పుడు చూడాలా అన్న ఆసక్తిగా కలిగిందని నిర్మాత రామ్ ఆచంట ప్రశంసించారు. పవర్ ప్యాక్డ్ ట్రైలర్.. పవన్ రీఎంట్రీ చిత్రమిది అంటూ బాలీవుడ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ప్రశంసించారు. ఆంగ్ల సబ్ టైటిళ్ల గురించి ఆయన ప్రస్థావించారు.
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ కమ్ బ్యాక్ ఇది. కథా ప్రాధాన్యత ఉన్న సినిమా ఇది. ఆర్టిస్టులంతా ఎవరికి వారే ప్రత్యేకంగా నటించారు.. సాంకేతికంగా అత్యున్నతంగా ఉంది! అంటూ రచయిత గోపి మోహన్ ట్వీట్ చేశారు. పవన్ కంబ్యాక్ ని పెద్ద తెరపై ఎప్పుడెప్పుడు చూడాలా అని ఎదురు చూస్తున్నా నంటూ దర్శకుడు గోపిచంద్ మలినేని ట్వీట్ చేశారు. వాట్ ఏ కమ్ బ్యాక్ అంటూ... ఎఫ్ 3 దర్వకుడు అనీల్ రావిపూడి ప్రశంసలు కురిపించారు. వాట్ ఏ పవర్‌ఫుల్ కమ్ బ్యాక్ అంటూ పవన్ కల్యాణ్ ని ప్రశంసించారు. మూడేళ్ల తర్వాత పవర్ స్టార్ బిగ్ కంబ్యాక్ అంటూ తమిళ హీరో శివకార్తికేయన్ ట్వీట్ చేశారు.