Begin typing your search above and press return to search.

జెర్సీకి క్యూ కడుతున్నసెలెబ్రిటీలు

By:  Tupaki Desk   |   20 April 2019 6:21 AM GMT
జెర్సీకి క్యూ కడుతున్నసెలెబ్రిటీలు
X
న్యాచురల్ స్టార్ నాని జెర్సీకు అవుట్ స్టాండింగ్ సక్సెస్ అనే మాట తప్ప ఇంకేమి వినిపించడం లేదు. అందరూ ముక్త కంఠంతో నాని సెలక్షన్ ని ఆకాశానికెత్తుతున్నారు. కేవలం ఒక్క సినిమా అనుభవం ఉన్న గౌతం తిన్ననూరిని నమ్మి ఇంత రిస్కీ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది . ఇదిలా ఉండగా విడుదలై 24 గంటలు దాటకుండానే జెర్సీకి సెలెబ్రిటీల ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి.

నిన్న హరీష్ శంకర్-మారుతీ-ఆర్పి పట్నాయక్ లాంటి ప్రముఖులు ఫస్ట్ షో చూడగానే స్పందించగా అసలైన కిక్ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చూడగానే వచ్చింది. చాలా ప్రత్యేకంగా ట్వీట్ చేసిన యంగ్ టైగర్ జెర్సీని చూసి తానెంత ఫ్లాట్ అయ్యింది వివరించిన తీరు నాని ఫ్యాన్స్ మనసులను గెలుచుకుంది. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఈ వరసలో చేరిపోయాడు

జెర్సీ చూశానని హృదయాన్ని హత్తుకునేలా ప్రతి ఒక్కరి కెరీర్ లో ఇదే బెస్ట్ అనిపించేలా తీశారని నానికి స్పెషల్ గ్రీటింగ్స్ చెబుతూ బెస్ట్ ఫిలిం అని కితాబు ఇచ్చేశాడు. అంతే కాదు గౌతం తిన్ననూరి గురించి ప్రత్యేకమైన ఉపమానాలు ఉపయోగించి కాంప్లిమెంట్స్ ఇచ్చాడు. ఇది బన్నీ ఫ్యాన్స్ ను సహజంగానే
ఆకట్టుకుంది.

మూవీ లవర్స్ ఖచ్చితంగా చూడాలని అదే పనిగా బన్నీ పేర్కొనడం విశేషం. మొత్తానికి జెర్సీకి సెలెబ్రిటీలు ఇస్తున్న సపోర్ట్ దానికి మంచి బూస్ట్ లా పని చేస్తోంది. ఇప్పటికే జోరుమీదున్న వసూళ్లు ఇప్పుడీ ట్వీట్ల ద్వారా సదరు అభిమానులు కూడా ఓసారి జెర్సి చూసేందుకు ప్రేరేపిస్తున్నాయి. మంచి సినిమాకు చేయూత ఉంటే ఎలా ఉంటుందనే ఉదాహరణగా జెర్సి నిలుస్తోంది