Begin typing your search above and press return to search.

ఇది ట్రైలర్ కాదు ప్రభాస్ సార్ .. తిరుగులేని ట్రీట్!

By:  Tupaki Desk   |   24 Dec 2021 12:34 PM GMT
ఇది ట్రైలర్ కాదు ప్రభాస్ సార్ .. తిరుగులేని ట్రీట్!
X
ప్రభాస్ - పూజ హెగ్డే జంటగా 'రాధేశ్యామ్' సినిమా రూపొందింది. మూడు పెద్ద బ్యానర్లు వందల కోట్ల రూపాయలను ఖర్చు చేసి ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో నిర్మించాయి. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, తెలుగుతో పాటు వివిధ భాషల్లో ఈ నెల 14వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంటులో ఫ్యాన్స్ తో కౌంటు డౌన్ చెప్పించి, ట్రైలర్ ను రిలీజ్ చేయించారు. ఈ ట్రైలర్ చూసిన సెలబ్రెటీలంతా కూడా ఈ సినిమా టీమ్ ను అభినందిస్తున్నారు. తాజాగా ఆ జాబితాలో ప్రశాంత్ నీల్ చేరిపోయాడు.

" ఈ సినిమా ట్రైలర్ ను చూశాను .. మొదటి నుంచి చివరివరకూ అమేజింగ్ ఎక్స్ పీరియన్స్ ను కలిగించింది. ప్రతి సెకండ్ కూడా ట్రీట్ ఇచ్చేలా అనిపిస్తోంది. ఆల్ ది బెస్ట్ ప్రభాస్ సార్. ఈ గ్రాండ్ వెంచర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న దర్శకుడితో పాటు, టీమ్ అందరికీ కూడా కంగ్రాట్స్" అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ప్రభాస్ .. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్' చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ షూటింగును జరుపుకుంది. 'రాధే శ్యామ్' విడుదల తరువాత మళ్లీ ప్రభాస్ ఈ సినిమా సెట్స్ పైకి వెళతాడు.

ఇక 'రాధేశ్యామ్' విషయానికి వస్తే ఇది ఖరీదైన ప్రేమకథగా కనిపిస్తోంది. కథ నేపథ్యం అంతా కూడా విదేశమే. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఎదగడం తెలుగు వారందరికీ గర్వకారణమే. అయితే ఈ సినిమాలో తెలుగుదనం లోపించిందనే టాక్ కూడా వినిపిస్తోంది. కథ .. పాత్రలు .. తెలుగుదనానికి దూరంగా వెళ్లాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ ను రఫ్ లుక్ తో మాస్ గా చూడటానికే అభిమానులు ఎక్కువగా ఇష్టపడతారు. అలాంటిది ఈ సినిమాలో ఆయనను క్లాస్ గా చూపిస్తున్నారు.

ఇక మరో విశేషమేమిటంటే ప్రభాస్ కి ఉన్నదే యాక్షన్ హీరో ఇమేజ్. ఒకేసారి ఆయన ఒక పదిమందిని కొడితే అభిమానులకు అది ఒక ఆనందం. ఆయన పర్సనాలిటీ అలాంటిది కనుక .. అది అసాధ్యమని వాళ్లు అనుకోరు. అలాంటిది ఈ సినిమాలో ఫైట్లు ఉండవని రాధాకృష్ణకుమార్ చెప్పగానే అభిమానులకు కొంతవరకూ నిరాశ కలిగింది. కాలం .. దేశం .. నాగరికత .. ఇవన్నీ పక్కన పెట్టేసి చూస్తే, ఇది ఒక స్వచ్ఛమైన .. అచ్చమైన ప్రేమకథ. ప్రేమకి భాషతో పనిలేదు కనుక, సినిమా చూస్తూ ఎంజాయ్ చేసేయడమే.