Begin typing your search above and press return to search.
కెల్విన్ వాంగ్మూలం ఆధారంగా సెలబ్రిటీలను నిందితులుగా చేర్చలేం: ఎక్సైజ్ శాఖ
By: Tupaki Desk | 20 Sep 2021 12:32 PM GMTడ్రగ్స్ వ్యవహారంలో టాలీవుడ్ ప్రముఖుల పేర్లు రావడం ఇండస్ట్రీలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. నాలుగేళ్ళ క్రితం డ్రగ్ సప్లయర్ కెల్విన్ ఇచ్చిన సమాచారం మేరకు తెలంగాణ ఎక్సైజ్ శాఖ మాదకద్రవ్యాల కేసులో పలువురు సెలబ్రిటీలను విచారించింది. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్ ఇచ్చిన ఆధారాలు బలంగా లేవని.. సెలబ్రిటీలపై అతని వాంగ్మూలం నమ్మశక్యంగా లేదని రంగారెడ్డి జిల్లా కోర్టుకు సమర్పించిన ఛార్జ్ షీట్ లో ఎక్సైజ్ శాఖ తెలిపింది. ఈ మేరకు కెల్విన్ పై నమోదు చేసిన ఛార్జ్ షీట్ లో పేర్కొంది.
ఎక్సైజ్ శాఖ ఛార్జ్ షీట్ ప్రకారం.. సినీ ప్రముఖులు - విద్యార్థులు - సాఫ్ట్ వేర్ ఉద్యోగులు మరియు హోటల్ నిర్వాహకులకు డ్రగ్స్ విక్రయించినట్లు కెల్విన్ వాంగ్మూలం ఇచ్చారు. ఈ మేరకు సిట్ బృందం పలువురికి నోటీసులు జారీ చేసి విచారించింది. అన్ని రకాల సాక్ష్యాలను సిట్ పరిశీలించి విశ్లేషించింది. సెలబ్రిటీలపై బలమైన తగిన ఆధారాలు లభించలేదు మరియు కెల్విన్ చెప్పిన విషయాలు నమ్మశక్యంగా లేవు. కెల్విన్ వాంగ్మూలం దర్యాప్తును తప్పుదోవపట్టించేలా ఉంది. కేవలం నిందితుడు చెప్పిన విషయాలను బలమైన ఆధారాలుగా భావించలేం.. సెలబ్రిటీలను నిందితులుగా చేర్చేందుకు కేవలం కెల్విన్ వాంగ్మూలం సరిపోదు. సెలబ్రిటీలు మరియు ఇతర అనుమానితుల వద్ద మాధకద్రవ్యాలు కూడా లభించలేదు అని పేర్కొన్నారు.
ఇకపోతే టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్ కు రంగారెడ్డి జిల్లా కోర్టు సమన్లు జారీ చేసింది. డిసెంబరు 9న విచారణకు హాజరు కావాలని కెల్విన్ ను కోర్టు ఆదేశించింది. ఇక డ్రగ్స్ వ్యవహారాల్లో మనీ లాండరింగ్ కోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ కొనసాగుతోంది. ఆగస్ట్ 31న దర్శకుడు పూరీ జగన్నాథ్ ను ప్రశ్నించడంతో ప్రారంభమైన ఈడీ విచారణ.. ఈ నెల 22న తరుణ్ ని ఎంక్వైరీ చేయడంతో ముగియనుంది. అయితే పూరీ - తరుణ్ నమూనాలలో డ్రగ్స్ ఆనవాళ్లు లేవని ఎఫ్ఎస్ఎల్ నివేదిక తేల్చిందని ఎక్సైజ్ అధికారులు కోర్టుకు తెలిపారు.