Begin typing your search above and press return to search.
ఇర్ఫాన్ మరణం సినిమా రంగానికి తీరని లోటు : మోడీ !
By: Tupaki Desk | 29 April 2020 6:30 PM ISTప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ క్యాన్సర్ కారణంగా మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన ఈ రోజు ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో కన్ను మూశారు. లండన్ లో చికిత్స చేయించుకున్న ఇర్ఫాన్ ఇటీవలే ఇండియాకు వచ్చారు. 'ఆంగ్రేజీ మీడియం' అనే సినిమాలో చివరిసారిగా నటించారు.
ఆయన మృతి వార్తతో భారతీయ చిత్ర పరిశ్రమ షాక్ కు గురైంది. ఇర్ఫాన్ మరణం పట్ల భారత ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇర్ఫాన్ ఖాన్ మృతి పట్ల భారత ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇర్ఫాన్ మరణం ప్రపంచ సినిమాకు, నాటక రంగానికి తీరని లోటు అని అన్నారు. నటనా రంగంలో అసమాన ప్రతిభను కనపరిచిన ఇర్ఫాన్ ఎప్పటికీ గుర్తుండిపోతారని .. ఇర్ఫాన్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని మోదీ ట్వీట్ చేశారు.
అలాగే మరోవైపు ఇర్ఫాన్ మృతిపై అమిత్ షా స్పందిస్తూ... మరణవార్త తనను ఎంతో ఆవేదనకు గురి చేసిందని చెప్పారు. అసమాన నటనతో ప్రపంచ స్థాయిలో ఇర్ఫాన్ పేరు ప్రఖ్యాతులను సొంతం చేసుకున్నారని కొనియాడారు. ఆయన మరణంతో దేశం ఒక గొప్ప నటుడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇర్ఫాన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.