Begin typing your search above and press return to search.
పునీత్ అంతిమ సంస్కారాలకు ప్రముఖులు.. బెంగళూరుకు తారక్!
By: Tupaki Desk | 30 Oct 2021 4:40 AM GMTకన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు నేడు బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టూడియోలో జరగనున్న సంగతి తెలిసిందే. తండ్రి రాజ్ కుమార్ సమాధి చెంతనే పునీత్ ని ఖననం చేయనున్నారు. ఈ అంత్యక్రియల కోసం రాష్ట్ర వ్యాప్తంగా పునీత్ అభిమానులు అన్ని ప్రాంతాల నుంచి విచ్చేయనుండగా పలు పరిశ్రమల నుంచి ప్రముఖులు బెంగళూరుకు బయల్దేరుతున్నారు. నేడు పునీత్ సోదరి అమెరికా నుంచి రాగానే ఖననం పూర్తవుతుంది.
తాజా సమాచారం మేరకు పునీత్ స్నేహితుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ బెంగళూరుకు బయల్దేరుతున్నారు. పునీత్ రాజ్ కుమార్ అంతిమ సంస్కారాల కు తారక్ సహా పలువురు టాలీవుడ్ ప్రముఖులు అటెండ్ కానున్నారని తెలిసింది. తెలుగు స్టార్లు చిరంజీవి - నాగార్జున- చరణ్ - అల్లు అర్జున్ - ఎన్టీఆర్ సహా పలువురికి పునీత్ రాజ్ కుమార్ ఎంతో సన్నిహితులు అన్న సంగతి తెలిసిందే.
46ఏళ్ల అతి పిన్న వయసులో మరణించిన స్టార్ గా పునీత్ అభిమానుల హృదయాల్ని ద్రవీభవింపజేస్తున్నారు. ప్రస్తుతం కంఠీరవ స్టూడియోస్ అభిమానుల తాకిడితో కిటకిటలాడిపోతోంది. కరోనా కల్లోలంలోనూ ఇంతటి అభిమానం వేరొక హీరోకి చూడలేం అనేంతగా ఫ్యాన్స్ తాకిడి కనిపిస్తోంది. ``మనం అతన్ని ప్రేమతో గౌరవంతో పంపించాలి. అందరూ శాంతియుతంగా నివాళులర్పించాలని కోరుతున్నాను`` అంటూ కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అభిమానుల్ని కోరారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో పునీత్ రాజ్ కుమార్ కు పెద్ద ఎత్తున అభిమానులు నివాళులు అర్పించారు. ఇక కన్నడ నాట పునీత్ రాజ్ కుమార్ సేవాకార్యక్రమాలపై పెద్ద ఎత్తున ప్రశంసలు కురుస్తున్నాయి. పునీత్ రాజ్ కుమార్ 2006లో తన తండ్రి డాక్టర్ రాజ్‌కుమార్ మాదిరిగానే నేత్రాలను దానం చేశారు.