Begin typing your search above and press return to search.

సినిమా సెలబ్రెటీ టీచర్లు..అభినందించాల్సిందే

By:  Tupaki Desk   |   5 Sep 2018 8:57 AM GMT
సినిమా సెలబ్రెటీ టీచర్లు..అభినందించాల్సిందే
X
సినిమా స్టార్స్‌ తమకున్న స్టార్‌ స్టేటస్‌ తో ఏ కార్యక్రమంకు వెళ్లినా - ఏ ఓపెనింగ్‌ కు వెళ్లినా కూడా తమ క్రేజ్‌ ను బట్టి పారితోషింను వసూళ్లు చేస్తూ ఉంటారు. అయితే హైదరాబాద్‌లోని పలు ప్రభుత్వ పాఠశాలలు మరియు హైదరాబాద్‌ శివారులో ఉన్న కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కొందరు సినిమా సెలబ్రెటీలు పిల్లలకు పాఠాలు భోదిస్తున్నారు. వారు పూర్తి ఉచితంగా పాఠాలను భోదించేందుకు ముందుకు రావడం అభినందనీయం. వారంలో కనీసం ఒక్కరోజు అయినా ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు ఆంగ్లంలో రాయడం, చదవడం నేర్పేందుకు ముందుకు వచ్చిన సినీ తారలు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ - రానా - అల్లు శిరీష్‌ - రెజీనా - ప్రణీత. వీరు నిస్వార్థతంతో పిల్లలకు ఇంగ్లీష్‌ పాఠాలు చెప్పేందుకు ముందుకు వచ్చారు.

టీచ్‌ ఫర్‌ ఛేంజ్‌ అనే ఒక స్వచ్చంద సంస్థ హైదరాబాద్‌ - రంగారెడ్డి జిల్లాలకు చెందిన దాదాపు 200 ప్రభుత్వ స్కూల్స్‌ ను దత్తత తీసుకోవడం జరిగింది. ఆ స్కూల్స్‌ కు టీచ్‌ ఫర్‌ ఛేంజ్‌ వలింటీర్స్‌ వారంలో ఒక రోజు వెళ్లి ఇంగ్లీష్‌ పాఠాలు మరియు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ కు సంబంధించిన క్లాస్‌ లను తీసుకుంటూ వస్తున్నారు. ఈ సంస్థ చేస్తున్న మంచి పనిని గురించిన సినీ తారలు కొందరు వాలంటీర్లుగా చేరడంతో సదరు స్వచ్చంద సంస్థకు మరింతగా గుర్తింపు దక్కింది.

ప్రస్తుతం ఈ స్వచ్చంద సంస్థలో 600 మంది వలంటీర్లు ఉన్నారు. తాజాగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ - రానా - అల్లు శిరీష్‌ - రెజీనాలు ఈ సంస్థ ఆద్వర్యంలో కొన్ని ప్రభుత్వ స్కూల్స్‌ కు వెళ్లి క్లాస్‌ లు తీసుకోవడం జరిగింది. సినిమా తారలు బయట అడుగు పెట్టాలి అంటే డబ్బు కావాలంటారు. కాని వీరు మాత్రం స్వచ్చందంగా ముందుకు వచ్చి, టీచింగ్‌ పై ఆసక్తితో వీరు క్లాసులు చెప్పేందుకు రావడం అభినందనీయం. వీరి దారిలోనే ఇంకా పలువురు సెలబ్రెటీలు కూడా తమ సంస్థలో జాయిన్‌ అవ్వాలని నిర్వాహకులు కోరుకుంటున్నారు.