Begin typing your search above and press return to search.
సెలబ్రిటీలందరికీ ఆ దీవులే కావాలి..!
By: Tupaki Desk | 14 Nov 2020 2:30 AM GMTకరోనా మహమ్మారి భయంతో సెలబ్రిటీలు ఇన్నాళ్లూ ఇంటికే పరిమితమయ్యారు. అనుకోకుండా వచ్చిన ఈ హాలిడేస్ ని హీరో హీరోయిన్లు తమ ఫ్యామిలీతో గడపడానికి ఉపయోగించుకున్నారు. అంతేకాకుండా లాక్ డౌన్ లో కొత్త కథలను వింటూ తదుపరి ప్రాజెక్ట్స్ లైన్లో పెట్టుకున్నారు. అయితే సినీ ప్రముఖులు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. సినిమా షూటింగ్ లకు హాజరవుతూ బిజీగా మారిపోతున్నారు. లాక్ డౌన్ ఎత్తేసి ప్రయాణాలకు అనుమతి లభించడంతో మరికొందరు విహారయాత్రలకు వెళుతున్నారు. ఈ మధ్య బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ చాలా మంది ప్రముఖులు హాలిడే ని ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియా మాధ్యమాలలో అప్లోడ్ చేస్తూ వస్తున్నారు. అయితే ఎక్కువ శాతం సెలబ్రిటీలు ఎంజాయ్ చేయడానికి మాల్దీవులను ఎంచుకుంటున్నారు. ప్రశాంతమైన మాల్దీవుల బీచ్ లలో హాలిడే సమయం గడపడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.
కరోనా లాక్ డౌన్ ఎఫెక్ట్ టూరిజమ్ పై బాగా పడింది. ప్రపంచ వ్యాప్తంగా టూరిజంపై ప్రభావం పడినప్పటికీ మాల్దీవుల్లో ఇప్పుడిప్పుడే మళ్ళీ పుంజుకుంటోంది. కోవిడ్ 19 ఎఫెక్ట్ ఇంకా ఉన్నప్పటికీ సెలబ్రిటీలు హాలిడే కోసం మాల్దీవులకు వెళ్ళడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన భర్తతో కలిసి హనీమూన్ కి అక్కడికే వెల్లడింది. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సందడి చేస్తోంది. ఇక హీరోయిన్ మెహ్రీన్ తన ఫ్యామిలీతో కలిసి ఈ దీవుల్లో ఎంజాయ్ చేసింది. ఇక తాప్సి అయితే అందరికంటే ముందే తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి మాల్దీవులకు వెళ్లి తిరిగొచ్చింది. టైగర్ ష్రాఫ్ - అక్షయ్ కుమార్ - మాధురీ దీక్షిత్ - సోనాక్షి సిన్హా వంటి వారు కూడా మాల్దీవులను చుట్టి వచ్చారు. ఇక బాలీవుడ్ ముద్దుగుమ్మ కత్రినా కైఫ్ కూడా మాల్దీవుల్లో సందడి చేస్తోంది. ఒకవైపు యాడ్ షూటింగ్ ను, మరోవైపు హాలిడేని పూర్తి చేస్తోంది. అక్కడి బీచ్ లో తీసుకున్న బికినీ ఫొటోలను పంచుకుంది. రాబోయే రోజుల్లో పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా అక్కడకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నారని తెలుస్తోంది.