Begin typing your search above and press return to search.
టాప్ స్టోరి: సెలబ్రిటీ వరల్డ్ లో విడాకుల కల్లోలం!
By: Tupaki Desk | 18 Jan 2022 3:26 AM GMTఉమ్మడి కుటుంబ వ్యవస్థ అంతరించిపోయింది. ప్రపంచీకరణ బిజీలైఫ్ పర్యవసానం మూల మూలలకు పాకిపోయింది. ప్రతిదీ బిజినెస్ మైండెడ్ గేమ్. దాని పర్యవసానం కుటుంబంలో అపార్థాలు కలతలు చిన్నాభిన్నాలు విచ్చిన్నాలు .. పొద్దున్న లేవగానే ఇవే వార్తలు. ఏది ఏమైనా భారతీయ సనాతన ప్రపంచంలో ఇప్పుడు విడాకులు అనేది ట్రెండింగ్ గా మారింది. జంటలు విడిపోవడం బాధించేదే అయినా కానీ కలతలతో కలిసి ఉండడం సరికాదని విడిపోతున్నవారే ఎక్కువ.
2021 ఎండింగ్ లో టాలీవుడ్ పెద్ద కుటుంబం నుంచి ఇలాంటి వార్త అభిమానుల్ని కలచివేసింది. అక్కినేని నాగచైతన్య- సమంత జంట విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించడం కల్లోలానికి కారణమైంది. దీనిని అభిమానులు నమ్మలేకపోయారు. ఇప్పుడు ఆ ఇద్దరూ ఎవరికి వారు యమునా తీరే అన్న చందంగా మళ్లీ బిజీ లైఫ్ లోనే సేదా దీరాల్సిన పరిస్థితి. చై-సామ్ కంటే ముందే మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తన భార్య కిరణ్ రావు నుంచి విడిపోతున్నట్టు ప్రకటించడం కల్లోలం రేపింది. ఇంతలోనే బాలీవుడ్ లో హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తున్న అర్జున్ కపూర్- మలైకా జంట విడిపోతున్నారన్న గుసగుసలు వేడెక్కించాయి. అయితే ఈ జంట ఈ వార్తల్ని ఖండిస్తూ నోట్ ని విడుదల చేసింది.
ఇప్పటికిప్పుడు కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్ - సౌందర్య జంట విడిపోతున్నట్టు ప్రకటించి బిగ్ షాకిచ్చారు. ఈ జంట 18 ఏళ్ల కాపురంలో కలతలు ఏర్పడి విడాకులు తీసుకున్నామని వెల్లడించారు. 23 ఏళ్ల వయసులో సౌందర్యను 21 ఏళ్ల ధనుష్ పెళ్లాడారు. ఈ జంటకు యాత్ర- లింగ అనే ఇద్దరు కుమారులున్నారు. ఇటీవలే హైదరాబాద్ లో సర్ (వాతి-తమిళం) సినిమా లాంచ్ వేడుకలో ధనుష్- సౌందర్య జంటగా పూజా కార్యక్రమాలు చేశారు. కానీ ఇంతలోనే విడిపోతున్నామని ప్రకటించడం షాకిచ్చింది.
ఈ వార్త ఇలా ఉండగానే మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ తన భర్త కళ్యాణ్ దేవ్ నుంచి విడిపోతున్నారన్న ప్రచారం మెగాభిమానుల్లో కలతకు కారణమవుతోంది. గడిచిన రెండు నెలలుగా ఈ జంట మధ్య సఖ్యత లేదు అంటూ మీడియా కథనాలు వైరల్ అవుతున్నాయి. దీనిని ఖండించకపోగా.. ఇప్పుడు శ్రీజ ఇన్ స్టా టైటిల్ మార్చుకోవడం చర్చనీయాంశమైంది. ఇన్ స్టా.. శ్రీజ కొణిదెలగా మార్పుతో కనిపించడంతో గుసగుసలు నిజమేనని నమ్మాల్సిన పరిస్థితి ఉంది. ఇరువైపుల నుంచి ఈ గాసిప్స్ ని ఖండిస్తూ వార్త వెలువడుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక టాలీవుడ్ నుంచి మరో యువహీరో కూడా భార్య నుంచి విడిపోతున్నారని గుసగుసలు స్ప్రెడ్ అవుతున్నాయి. ఓ ఇద్దరు ప్రముఖ తెలుగు దర్శకులు హీరోయిన్ల తో ఎఫైర్ల కారణంగా భార్య నుంచి విడిపోనున్నారని గుసగుసలు ఇంతకుముందు స్ప్రెడ్ అయ్యాయి. కానీ ఆ తర్వాత ఆ గుసగుసలు సద్దుమణిగాయి.
అటు బాలీవుడ్ లో మాజీ విశ్వసుందరి సుశ్మితాసేన్ .. మోడల్ రోహ్మన్ షాల్ నుంచి విడిపోతున్నట్టు ప్రకటించారు. బంధంలో నమ్మకం చాలా ముఖ్యం. ఈ మగాళ్లు మారరు! అంటూ సుశ్మితా సేన్ తనలోని ఆవేదనను వ్యక్తం చేశారు. కొత్త ఏడాదిలో జంటలు విడిపోవడం అభిమానులకు నిరాశనే కలిగిస్తోంది. ఇలాంటి వార్తలు వినడానికి ఎవరూ ఆసక్తిగా లేరు. కానీ మారిన జీవన శైలి.. కుటుంబ వ్యవస్థలో ఇది సర్వసాధారణంగా మారింది. కలతలతో విడిపోతున్నామని ప్రకటించేవారే ఇటీవల ఎక్కువయ్యారు.