Begin typing your search above and press return to search.
#RRR నాటు .. సిడ్ అలా.. సామ్ ఇలా.. ఏంటో కానీ
By: Tupaki Desk | 10 Nov 2021 5:30 PM GMTదర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ వచ్చే సంక్రాంతికి సంచలనాలు సృష్టించేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. చరణ్ - ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రంలో అజయ్ దేవగన్- ఆలియా భట్ -ఒలీవియో మోరిస్ తదితరులు నటిస్తున్నారు. ఆర్.ఆర్. ఆర్ (రౌద్రం.. రణం.. రుధిరం) టైటిల్ కి తగ్గట్టే ఈ సినిమాని అత్యంత భారీ యాక్షన్ ఘట్టాలతో రాజమౌళి తెరకెక్కించారు.
మరకతమణి ఎం.ఎం. కీరవాణి అందించిన సంగీతం ఈ సినిమాకి మరో ప్రధాన ఆకర్షణగా మారింది. ఇప్పటికే రెండు పాటలు విడుదలై అభిమానుల్లోకి దూసుకెళ్లాయి.
తాజాగా విడుదల చేసిన నాటు నాటు పాటకు స్పందన ఓ రేంజులో ఉంది. దీనిపై చిత్రపరిశ్రమ ప్రముఖులు అద్భుతమైన కొటేషన్స్ ఇచ్చారు. అందులో సమంత కోట్ సహా సిద్ధార్థ్ కోట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సామ్ చాలా సింపుల్ గా `మెంటల్` అని వ్యాఖ్యానిస్తే సిద్ధార్థ్ తనలో ఉత్సుకతను ఆపుకోలేకపోతున్నానని వ్యాఖ్యానించారు. సిద్ధార్థ్ ట్వీట్ చేస్తూ.. ``ఎగ్జైయిట్ మెంట్ ను ఆపుకోలేకపోతున్నా. ఇండియన్ సినిమాలో గొప్ప డ్యాన్సర్లు అయిన రామ్ చరణ్- తారక్ లు కలిసి మంట పెట్టేస్తున్నారు. ఇక ఈ పాటకు థియేటర్లో ఇక అరుపలే.. ఇదే రాజమౌళి మ్యాజిక్`` అంటూ వ్యాఖ్యను జోడించారు.
ఈ పాటకు థియేటర్లలో పేలుడు ఖాయం అంటూ దర్శకుడు మలినేని గోపీచంద్ వ్యాఖ్యానించగా.. డైరెక్టర్ బాబీ ``వాట్ ఏ ఊరనాటు సాంగ్ దిస్ ఈజ్!`` అని పోస్ట్ చేశాడు. హాస్యనటుడు శ్రీనివాసరెడ్డి `నాటు`కు పోయింది పాట! అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించగా..`ఇది ఊరనాటు` అంటూ అనిల్ రావిపూడి పొగిడేశారు. ఇక చరణ్ అభిమానుల నుంచి తారక్ అభిమానుల నుంచి అన్ లిమిటెడ్ గా సోషల్ మీడియాల్లో స్పందనలు వ్యక్తమవుతున్నాయి.