Begin typing your search above and press return to search.
పిచ్చిరాతలు.. మార్ఫింగ్ ఫొటోలు.. కుంగిపోతున్న సెలబ్రెటీలు
By: Tupaki Desk | 18 April 2019 2:30 PM GMTసమాచారాన్ని క్షణాల్లో ప్రపంచానికి తెలియజెప్పాలంటే ఇప్పుడు సోషల్ మీడియానే ప్రధాన అవసరంగా మారింది. ఎలాంటి సందర్భాన్నైనా సామాజిక మాధ్యమాల ద్వారా కమ్యూనికేషన్స్ పెంచుకుంటూ మనుషులు దగ్గరవుతున్నారు. ప్రత్యక్షంగా ఒకరినొకరు కలుసుకోకపోయినా ఆన్ లైన్ లో ఎప్పుడు చిట్ చాట్ తో స్నేహితులు, బంధువులు మాట్లాడుకుంటూనే ఉంటారు. అయితే ఈ సోషల్ మీడియాతో అవసరాలు ఎన్ని ఉన్నా ఇబ్బందులు చాలా ఉన్నాయని అర్థమవుతోంది. కొందరు సినీ నటీమణులు - సెలబ్రెటీలకు అవి ప్రాణాంతకంగా మారుతున్నాయి.
మొన్న దివంగత ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి... తాజాగా తెలుగు సినీ నటి పూనమ్ కౌర్.. వీరంతా సైబర్ క్రైమ్ దారి పట్టారు. తమపై అసభ్యంగా రాతలు రాస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో ఫ్రధానంగా ఉన్న యూట్యూబ్ లోని కొన్ని ఛానెళ్లల్లో తమను ప్రధానంగా చేసుకొని అసభ్యంగా వీడియోలు తయారు చేస్తున్నారని, రాజకీయంగా అణగదొక్కడానికి కొందరు జట్టుగా ఏర్పడి కుట్రలు పన్నుతున్నారని పూనమ్ కౌర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. 50కి పైగా వెబ్ సైట్లు, ఛానెళ్లకు సంబంధించిన లింకులను ఆమె పోలీసులకు అందించింది.
ఈ ఫిర్యాదులు ఇప్పుడే వస్తున్నవి కావు.. గతంలోనూ యూట్యూబ్ లో అసభ్యకర వీడియోలు ప్రసారం చేస్తున్నారని కాంప్లెంట్స్ వచ్చాయి. అప్పట్లో అసభ్యకర వీడియోలను నియంత్రిస్తామని చెప్పిన ఆయా సోషల్ మీడియా సంస్థలు.. తరువాత తమ రేటింగ్ ఎక్కడ పడిపోతుందోనని మళ్లీ వ్యూస్ కోసం దారుణాలు ప్రచారం చేస్తున్నాయి.
పర్సనల్ డేటా అని యాప్ ల్లో - వెబ్ సైట్లలో పొందుపరిస్తే కొందరు కేటుగాళ్లు ఈ డేటాను దొంగిలించి ఆ డాటాను వక్రీకరిస్తున్నారు. ఆ డేటాతో అసభ్యకరంగా వీడియోలు, మార్పింగ్ చేసిన ఫొటోలు తయారు చేసి బహిర్గత పరుస్తున్నారు. దీంతో తమ డేటా ఇతర పోస్టుల్లో ఉండడం చూసి కొందరు మానసికంగా కుంగిపోతున్నారు. అయితే వీరి ఆగడాలకు అడ్డుకట్టే వేసేవాళ్లు లేరా..? అంటే సైబర్ క్రైమ్ పోలీసులు వారిపై చర్యలు తీసుకుంటున్నా.. కొందరు రాజకీయ నాయకుల అండదండలతో తమపై ఈగ వాలనీయకుండా సదురు వెబ్ చానళ్ల వారు చేసుకుంటున్నారు. ఇలా సెలెబ్రెటీలపై పిచ్చి రాతలు - కూతలు వారిని కృంగిపోయేలా చేస్తున్నాయి.. దీనికి అడ్డుకట్ట పడకపోతే మరిన్ని అనర్థాలు జరుగుతూనే ఉంటాయి.