Begin typing your search above and press return to search.
సెలబ్రిటీలు డ్రగ్స్ ఎందుకు తీసుకుంటారు...?
By: Tupaki Desk | 23 Sep 2020 12:10 PM GMTబాలీవుడ్ లో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారం యావత్ సినీ ఇండస్ట్రీని కుదిపేస్తోంది. గతంలో ఎన్నోసార్లు చిత్ర పరిశ్రమలోని డ్రగ్స్ మాఫియా గురించి వార్తలు వచ్చినప్పటికీ.. ఇటీవల మరణించిన యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమాస్పద మృతితో మళ్ళీ హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే డ్రగ్స్ కేసుపై ఫోకస్ పెట్టిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో హీరోయిన్ రియా చక్రవర్తితో పాటు పలువురు డ్రగ్ పెడ్లర్స్ ని కూడా అరెస్ట్ చేశారు. వీరిని విచారిస్తున్న క్రమంలో మరింత మంది సెలబ్రిటీలకు డ్రగ్ మాఫియాతో లింకులు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఇక బాలీవుడ్ లో పేలిన డ్రగ్ బాంబ్ ప్రకంపనలు శాండిల్ వుడ్ కు పాకాయి. కన్నడ చిత్ర సీమలో అనేకమంది నటీనటులు టెక్నీషియన్స్ నిషేధిత డ్రగ్ యూజర్లేనని గుర్తించిన సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పలువురిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఇప్పటికే హీరోయిన్ రాగిణి ద్వివేదితో పాటు సంజన గల్రానీని కూడా అరెస్ట్ చేశారు. నిజానికి డ్రగ్స్ మాఫియా అనేది ఎప్పటినుంచో సినీ ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్న సమస్య అన్నట్లు ప్రొజెక్ట్ అయింది. ఈ నేపథ్యంలో సెలబ్రిటీలు డ్రగ్స్ ఎందుకు తీసుకుంటున్నారు అని అన్ని వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
కాగా, సెలబ్రిటీలు డ్రగ్స్ తీసుకోవాడానికి మెయిన్ రీజన్ తమలో పెరిగే మానసిక ఒత్తిడిని కంట్రోల్ చేసుకోవడానికే అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. సినిమా అనే రంగుల ప్రపంచంలో డబ్బు మరియు ఫేమ్ సంపాదించే క్రమంలో నటీనటులు టెక్నీషియన్స్ అందరూ స్ట్రెస్ కి గురవుతుంటారు. హిట్ ప్లాపుల మధ్య తమ కెరీర్ ని నిలబెట్టుకునే క్రమంలో వీరందరూ ఒత్తిడికి లోనవుతారని.. దాని వల్ల ఉపశమనం పొందుతారనే భ్రమలో డ్రగ్స్ తీసుకుంటుంటారని తెలుస్తోంది. మరికొందరు వర్క్ టెన్షన్ తో పాటు ఫ్యామిలీ టెన్షన్స్ కూడా చేరడంతో డ్రగ్స్ బారిన పడుతున్నారని అంటున్నారు. అంతేకాకుండా ఫిట్ నెస్ మరియు సౌందర్యం కోసం కూడా డ్రగ్స్ తీసుకుంటారని పలువురు అభిప్రాయపడుతున్నారు. బాడీని మైంటైన్ చేయడంతో పాటు వయసు మీద పడకుండా ఉండటానికి కూడా కొన్ని రకాల మాదక ద్రవ్యాలు తీసుకుంటారని కామెంట్స్ వస్తున్నాయి. ఇందులో నిజమెంత ఉందో తెలియదు కానీ.. సినీ ఇండస్ట్రీలలో జరిగే పార్టీ కల్చర్ లో వీటిని అలవాటు చేసుకొని.. మెల్లమెల్లగా డ్రగ్స్ కి బానిసలుగా మారుతున్నారని అంటున్నారు. ఈ క్రమంలోనే డ్రగ్స్ కి బానిసలైన సెలబ్రిటీలను లొంగదీసుకుని కొంతమంది డ్రగ్ డీలర్స్ డ్రగ్ వ్యాపారులతో డీలింగ్స్ పట్టుకొని.. ఇక్కడ సెలబ్రిటీలను డ్రగ్స్ ఉచ్చులోకి దింపుతారని తెలుస్తోంది. ఈ మధ్య హీరోయిన్స్ కంగనా రనౌత్ - మాధవీలత వంటి వారు సినీ ఇండస్ట్రీలో జరిగే పార్టీలలో డ్రగ్స్ కంపల్సరీ అని కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.