Begin typing your search above and press return to search.
కరోనా టైమ్ లో కలిసి నడిచిన సెలబ్రిటీలు వీరే!
By: Tupaki Desk | 24 Dec 2021 11:30 PM GMTపెళ్లంటే నూరేళ్ల పంట అన్నారు పెద్దలు. పెళ్లంటే ఒక గూడులో .. ఒకరి నీడలో ఒకరు .. ఒకరి కోసం ఒకరు బ్రతకడమే. సమస్యలు ఎదురైతే సామరస్యంగా పరిష్కరించుకోవాలి .. కష్టాలు ఎదురైతే సమర్థవంతంగా కలిసి ఎదుర్కోవాలి అనేదే కొత్త దంపతులకు పెళ్లి చెప్పే సారాంశం. స్త్రీ పురుషుల ఇద్దరి జీవితాలలోను పెళ్లి అనేది చాలా ప్రధానమైనది. పెళ్లికి ముందు జీవితం వేరుగా ఉంటుంది .. తరువాత జీవితం వేరుగా ఉంటుంది. ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటే ఆనందంగా ఉంటుంది. పెళ్లిళ్లలో స్టార్స్ పెళ్లి వేరయా అన్నట్టుగా, సహజంగానే వాళ్ల పెళ్లికి సందడి ఎక్కువగా ఉంటుంది.
స్టార్స్ పెళ్లి వేడుకలను చూడటానికి .. ఆ పెళ్లి విశేషాలను తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తిని చూపుతూ ఉంటారు. ముఖ్యంగా పెళ్లి పేరుతో ప్రేమ పక్షులు ఒకటి అవుతున్నప్పుడు ఆ కుతూహలం మరింత ఎక్కువగా ఉంటుంది. అలా చూసుకుంటే ఈ ఏడాదిలో చాలామంది సెలబ్రిటీల వివాహాలు జరిగిపోయాయి. కరోనా ఎప్పుడు తగ్గుముఖం పడుతుందా అని ఎదురు చూసి చూసి మరీ 'మమ' అనిపించారు. కొంతమంది తమ వివాహ వేడుకను ఘనంగా జరుపుకుంటే, ఇద్దరు కలిసి కాపురం చేసుకోవడానికి ఇంత హడావిడి అవసరమా అనుకున్న వాళ్లు సింపుల్ గా కానిచ్చేశారు.
జనవరి 9వ తేదీన సింగర్ సునీత వివాహం వ్యాపారవేత్త రామ్ వీరపనేనితో జరిగింది. మొదటి భర్త నుంచి విడాకులు తీసుకున్న చాలాకాలానికి ఆమె రెండవ వివాహం చేసుకున్నారు. ఇక తెలుగు అమ్మాయి 'ఆనంది' వివాహం జనవరి 11న జరిగింది. తమిళంలో ఎక్కువ సినిమాలు చేసిన ఆమె అక్కడి దర్శకుడు సోక్రటీస్ ను వివాహమాడారు. ఆ తరువాత కూడా ఆమె 'శ్రీదేవి సోడా సెంటర్' సినిమాలో నటించారు. ఇక జనవరి 14వ తేదీన వరుణ్ ధావన్ - నటాషా దలాల్ పెళ్లి జరిగింది. బాలీవుడ్ లో వరుణ్ ధావన్ కి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.
ఫిబ్రవరి 15వ తేదీన దియా మీర్జా వివాహం జరగ్గా, ఏప్రిల్ 22వ తేదీన గుత్తాజ్వాల పెళ్లి జరిగింది. తమిళ నటుడు విష్ణు విశాల్ ను ఆమె వివాహం చేసుకున్నారు. తెలుగులో నాజూకు కథానాయికగా మంచి మార్కులు కొట్టేసిన ప్రణీత, బెంగుళూరులోని వ్యాపారవేత్త అయిన నితిన్ రాజుతో కలిసి ఏడడుగులు వేశారు. తెలుగుతో పాటు బాలీవుడ్ సినిమాల్లోనూ నటించిన యామీ గౌతమ్, జూన్ 4వ తేదీన బాలీవుడ్ నటుడైన ఆదిత్యధర్ కి అర్ధాంగిగా మారారు.
ఇక తెలుగులో హీరోగా నిలదిక్కుకుంటున్న కార్తికేయ, కాలేజ్ డేస్ లో ప్రేమించిన లోహిత రెడ్డిని జీవిత భాగస్వామిగా చేసుకున్నారు. ఇక సన్నజాజి మొగ్గలా కనిపిస్తూ బాలీవుడ్ ను ఒక ఊపేసిన కత్రినా,ఈ నెల 9వ తేదీన విక్కీ కౌశల్ జీవితంలోకి అడుగుపెట్టిన్న విషయం తెలిసిందే. మొత్తానికి అటు పన్నీరుకి .. ఇటు శానిటైజర్లకి మధ్య ఈ ఏడాది కూడా సెలబ్రిటీల ఇంట పెళ్లి పందిళ్లు .. సందళ్లు కనిపించడం విశేషం.