Begin typing your search above and press return to search.
ఆమెకు ధైర్యం చెపుతున్న సెలెబ్రిటీలు
By: Tupaki Desk | 5 July 2018 5:20 PM GMTసోనాలి బింద్రే.. ఈమె తెలుగులో ఇప్పటిదాకా నటించింది కేవలం 6 సినిమాలలో మాత్రమే. కానీ అందులో మన్మథుడు, ఇంద్ర, మురారి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి. ఆమె కాన్సర్ బారిన పడిందన్న విషయం ఆమె కుటుంది సభ్యులనే కాక ఫ్యాన్స్ ని కుడా కలచి వేసింది. ఆమెకు హై గ్రేడ్ కాన్సర్ సోకిందంటూ ఆమె సోషల్ మీడియా లో పోస్ట్ చేయగా, ఫ్యాన్స్ తో పాటు సెలెబ్రిటీలు కూడా ఆమెకు ధైర్యం చెప్తూ పోస్టులు పెట్టారు.
టాలీవుడ్ నుండి నాగార్జున సోనాలి త్వరగా కోలుకోవాలని, ధైర్యంగా ఉండమని ట్వీట్ పెట్టగా, రితేష్ దేశముఖ్ కూడా ఈ వార్త విన్నవెంటనే చాలా కృంగిపోయానని, సోనాలి త్వరలో కోలుకోవాలని దేవుడిని ప్రార్ధిస్తానని పేర్కొన్నారు. "నాకు తెలిసిన స్ట్రాంగ్ ఆడవాళ్ళలో సోనాలి బింద్రే ఒకరు. ఆమె ఒక వండర్ వుమన్. తల్లిగా, నటిగా, రచయిత్రిగా మరియు భార్యగా ఆమె ఎందరో మహిళలకు ఆదర్శవంతంగా నిలిచింది. కాన్సర్ తప్పకుండా నీ చేతిలో ఒడిపోతుంది. మా ప్రేమాభిమానాలు ఎల్లప్పుడు నీతోనే ఉంటాయి" అంటూ వివేక్ ఒబెరాయ్ ట్వీట్ చేశారు.
బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ కూడా చాలా ఎమోషనల్ గా స్పందించారు. " ఆ బాస్టర్డ్ ని ఎలాగైనా ఓడించు" అంటూ సోనాలిలో ధైర్యం నింపడానికి ప్రయత్నించారు. సెలెబ్రిటీలు కాక ఫాన్స్ కూడా తమ ప్రార్ధనలు సోషల్ మీడియా ద్వారా సోనాలి కి అందచేశారు. ఆమె ఎలాగైనా కాన్సర్ నుండి బయటపడి త్వరలో కోలుకోవాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం.