Begin typing your search above and press return to search.
డ్రగ్స్ కేసులో ఓ ప్రముఖుడికి షాక్ తప్పదా? ఆధారాలు లభిస్తే అడ్డంగా బుక్ ఖాయమట
By: Tupaki Desk | 29 Aug 2021 8:10 AM GMTటాలీవుడ్ డ్రగ్స్ కేసు రేపిన కలకలం అంతా ఇంతా కాదు. ఈ కేసును మూసేసినట్లుగా కొందరు భావిస్తున్న వేళ.. అందుకు భిన్నంగా ఈడీ దర్యాప్తు కొత్త టెన్షన్ పుట్టిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ నెల 31న టాలీవుడ్ కు చెందిన 12 మంది సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేయటం.. వారిని విచారణకు హాజరు కావాలంటూ షెడ్యూల్ ను విడుదల చేయటం తెలిసిందే. ఈ సందర్భంగా కొత్త అంశం ఒకటి తెర మీదకు వచ్చింది.
డ్రగ్స్ కేసులో సంపాదించిన మొత్తం ఎవరి చేతుల్లోకి వెళ్లింది? దాని అంతిమ ప్రయోజనం పొందేదెవరు? అన్న కీలక అంశంపై ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఆధారాలు లభిస్తే.. ఒక ప్రముఖుడికి తిప్పలు తప్పవన్న మాట బలంగా వినిపిస్తోంది. ఒకవేళ.. అధికారుల అనుమానాలు నిజమై.. అందుకు సంబంధించిన పక్కా ఆధారాల్ని సేకరించే దానిపై ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. అప్పట్లో విచారణ జరిపి.. నివేదికను రూపొందిన దాని ప్రకారం.. డ్రగ్స్ ను విదేశాల నుంచి తెప్పించిన అంశాన్ని తవ్వుతున్నారు.
ఈ అంశంపై క్లారిటీ వస్తే.. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం.. సింఫుల్ గా చెప్పాలంటే ఫెమా కింద దర్యాప్తు చేస్తారన్న మాట వినిపిస్తోంది. డ్రగ్స్ కోసం హవాలా మార్గంలో భారీ ఎత్తున సొమ్ములు చేతులు మారినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించి ఆధారాల్ని అన్వేషిస్తున్నారు. విదేశాలకు హవాలా రూపంలో డబ్బులు పంపినట్లుగా తేలితే.. దాని అంతిమ లబ్థిదారు ఎవరన్న విషయాన్ని బయటకు లాగుతారని.. అందులో ఒక ప్రముఖుడి హస్తం ఉన్నట్లుగా సమాచారం. ఈ వ్యవహరం ఇప్పుడు టాలీవుడ్ గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తుందన్న మాట వినిపిస్తోంది.
ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం పబ్ ను నిర్వహించే ప్రముఖుడు ఒకరు డ్రగ్స్ ను తెప్పించి.. భారీ మొత్తంలో సినీ ప్రముఖులకు అందజేసినట్లుగా చెబుతున్నారు. అయితే.. దీనికి సంబంధించిన స్పష్టమైన ఆధారాలు ప్రస్తుతానికి లేవు. కాకుంటే.. వాటి సమాచారం త్వరలోనే చేతికి వస్తుందని చెబుతున్నారు. అంతేకాదు.. ఈ మొత్తంతో ఆస్తుల్ని కొనుగోలు చేసి ఉంటే.. వాటిని కూడా సీజ్ చేస్తారని చెబుతున్నారు. ఇంతకీ ఆ ప్రముఖుడు ఎవరు? అన్న ప్రశ్నకు సూటి సమాధానం లభించని పరిస్థితి నెలకొంది.