Begin typing your search above and press return to search.
ఫోకస్: బిగ్ సెలబ్రిటీ మీనింగ్
By: Tupaki Desk | 4 Dec 2018 5:19 AM GMTమీడియాని ఎంత గా కొంగున కట్టేసుకుంటే అంత పెద్ద సెలబ్రిటీ. ఈ విషయంలో టాలీవుడ్ చాలా నేర్చుకోవాల్సి ఉంది. ఒకే ఒక్క `బాహుబలి` ఫ్రాంఛైజీ తప్ప ఇతరులెవరూ ఆ రేంజులో మీడియా అటెన్షన్‌ని తమ వైపు తిప్పేసు కోలేకపోయారు. `బాహుబలి` ప్రారంభోత్సవానికి ముందు నుంచీ వరల్డ్ వైడ్ పాపులారిటీ తెచ్చుకోవడంలో రాజమౌళి, ఆర్కా మీడియా పెద్ద సక్సెసైంది. ఆ తర్వాత పబ్లిసిటీ విషయంలో ఆర్జీవీ ... ప్రియాంక చోప్రా- నిక్ ,... దీపిక- రణవీర్ .. వీళ్లను చూసి నేర్చుకోవాలి. నిరంతరం వివాదాలతో ఆర్జీవీ మీడియా వార్తల్లో నిలుస్తుంటాడు. చివరికి ఎవరికీ తెలియని `భైరవగీత` లాంటి చిన్న సినిమాకు సైతం `2.ఓ` కాన్సెప్టును వాడేసి పాపులారిటీ తేగలి గాడు. టైమ్ చూసి టైమింగుతో దెబ్బ కొట్టడం ఆర్జీవీ స్టైల్.
అప్పట్లో మైక్ టైసన్ ఇండియాకి వచ్చి వెళ్లిన సంగతి ఎందరికి తెలుసు? డొనాల్డ్ ట్రంప్ ఇండియాని ఎలా ముంచాలనుకుంటున్నాడో ఎందరికి తెలుసు? చివరికి తెలంగాణ లో ఎన్నికల గురించి అయినా అందరికీ తెలుసా? అంటే డౌటే.. కానీ ఆర్జీవీ గురించి, పీసీ గురించి, దీపిక గురించి ప్రజలకు తెలుసు. అందుకే వీళ్లంతా బిగ్ సెలబ్రిటీస్. అంతెందుకు దాదాపు 200 కోట్ల బడ్జెట్‌తో తీస్తున్న `సైరా -నరసింహారెడ్డి` చిత్రానికి రాని గుర్తింపు ఆర్జీవీ ఓవరాక్షన్ పబ్లిసిటీకి వస్తోందంటే అతిశయోక్తి కాదు. 250 కోట్ట బడ్జెట్‌తో తీస్తున్న `సాహో`కు సైతం `బాహుబలి`కి చేసినంత ప్రచారం లేదు. ఈ సినిమా ప్రచార వీడియోలు, ప్రోమోలు వస్తే కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు.
ఇటీవలి కాలంలో గీతగోవిందం,- నోటా, -ట్యాక్సీవాలా చిత్రాలతో విజయ్ దేవరకొండకు వచ్చిన పబ్లిసిటీ ఇతర హీరోల్లో ఎవరికీ రాలేదు. రాజమౌళి-రామారావు-రామ్‌చరణ్ మల్టీస్టారర్ కి సైతం అంత పాపులారిటీ రాలేదంటే అతిశయోక్తి కాదు. దేవరకొండ తనని తాను అంతగా యూత్‌లో ప్రొజెక్ట్ చేసుకోవడంలో సక్సెసయ్యాడు. తమ సినిమాల రిలీజ్‌లేవీ లేకపోవడంతో టాలీవుడ్ లో స్టార్ హీరోలంతా సైలెంటయిపోయారు. ఇప్పటికి వాళ్లు బిగ్ సెలబ్రిటీస్ కానేకాదు. ఈ సీజన్‌లో బిగ్ సెలబ్రిటీస్ అంటే ఆర్జీవీ - దేవరకొండ - పీసీ - దీపిక పదుకొనె మాత్రమే. వీళ్ల గురించి జనంలో విస్త్రతంగా చర్చ సాగుతూనే ఉంది. ఇక ఆర్జీవీ బాటలో ఒక షాడో మ్యాన్ తనకు ప్రచారం చేసుకుంటున్నాడు. ఇటీవలి కాలంలో ఈ పంథాను అనుసరించేందుకు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి అనే స్మాల్ టైమ్ ప్రొడ్యూసర్ కం బీజేపీ నాయకుడు ప్రయత్నిస్తున్న వైనం బయటపడుతోంది. అతడు ప్రతిసారీ ఏ ఇష్యూ వచ్చినా మీడియా మెయిల్స్ కి వార్తలు పంపిస్తుంటారు. వివాదాలకు ఆజ్యం పోస్తుంటారు. అయినా బిగ్ సెలబ్రిటీ కాలేడెందుకో!! జనాల అటెన్షన్‌ని తిప్పేసుకోవడం అంత వీజీ కాదు. తిప్పేసే ట్యాలెంట్ ఉంటే బిగ్ సెలబ్రిటీ అన్నమాట!!