Begin typing your search above and press return to search.
RRR నిర్మాత ఇంట్లో పెళ్లి సందడి.. స్టార్స్ హడావుడి
By: Tupaki Desk | 22 May 2023 5:21 PM GMTఆర్ఆర్ఆర్ సినిమా నిర్మాత డీవీవీ దానయ్య గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. టాలీవుడ్ లోని చాలా పెద్ద సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు ఆయన. ఇటీవల ఆయన ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది. ఈ పెళ్లిలో టాలీవుడ్ స్టార్స్ హాజరై సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
దానయ్య కుమారుడు కళ్యాణ్ వివాహం చాలా గ్రాండ్ గా నిర్వహించారు. సమంత అనే అమ్మాయితో కళ్యాణ్ వివాహం జరిపించారు. హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో ఈ వివాహ వేడుక జరిగింది. దానయ్య దంపతులు టాలీవుడ్ నుంచి వచ్చిన ప్రముఖుల్ని రిసీవ్ చేసుకుని వారితో కలసి ఫోటోలు దిగారు. కాగా, వీరి పెళ్లి వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ , డైరెక్టర్ రాజమౌళి, త్రివిక్రమ్, ప్రశాంత్ నీల్ వంటి ప్రముఖులు హాజరై సందడి చేశారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు.
దానయ్య టాలీవుడ్ లోని చాలా గొప్ప సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. త్వరలోనే ఆయన తన కుమారుడిని కూడా హీరోగా పరిచయం చేయాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం సినిమా చేస్తున్నాడు కూడా. ఈ సినిమాకి జాంబిరెడ్డి ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమాకి టైటిల్ కూడా ప్రకటించారు. మూవీకి అధీరా అనే టైటిల్ ని ఖరారు చేశారు. తన కొడుకు చిత్రానికి కూడా దానయ్య స్వయంగా నిర్మాణ బాధ్యతలు చేపడుతుండటం విశేషం. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తైనట్లు తెలుస్తోంది. త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉండగా, ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత దానయ్య ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా, సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓజీ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సుజిత్ దీనికి ముందు సాహో సినిమా కి దర్శకత్వం వహించారు. ప్రభాస్ హీరోగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో ఓజీ ఎలా ఉంటుందా అని ఫ్యాన్స్ కంగారుపడుతున్నారు.