Begin typing your search above and press return to search.

టాలీవుడ్ యూత్ యూనిటీ బాగుందమ్మా

By:  Tupaki Desk   |   11 Nov 2017 6:16 AM GMT
టాలీవుడ్ యూత్ యూనిటీ బాగుందమ్మా
X
నారా రోహిత్ లేటెస్ట్ మూవీ బాలకృష్ణుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా జరిగింది. ఈ సినిమాలో నటించకపోయినా.. పలువురు టాలీవుడ్ యంగ్ హీరో హీరోయిన్లు ఈ ఫంక్షన్ లో సందడి చేశారు. బాలకృష్ణుడులో హీరోయిన్ గా నటించిన రెజీనా కసాండ్రా.. ఈవెంట్ కు హాజరు కాలేకపోయింది. కానీ ఆ లోటు ఏ మాత్రం కనిపించకుండా చేసేశారు ఇతర హీరో హీరోయిన్లు.

ప్రధానంగా తెలుగింటి కోడలుగా మారిన సమంత.. బాలకృష్ణుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ అయింది. ఈ సినిమా నిర్మాత మేనేజర్ గిరిధర్ కావడంతో.. సమంత ప్రత్యేక ఆహ్వానితురాలిగా ఈ ఈవెంట్ లో సందడి చేసింది. మరోవైపు.. మెగా హీరో సాయిధరం తేజ్ కూడా బాలకృష్ణుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హంగామా చేశాడు. నారా రోహిత్ తో మంచి సాన్నిహిత్యం ఉన్న మరో కుర్ర హీరో నాగ శౌర్య కూడా ఫంక్షన్ లో సందడి చేశాడు. యంగ్ హీరోయిన్ రాశి ఖన్నా అయితే.. ఈవెంట్ లో బోలెడన్ని మెరుపులు మెరిపించేసింది.

ఒక ఫంక్షన్ కు ఒకరిద్దరు గెస్టులు మాత్రమే కనిపించడమే ఆకట్టుకునే విషయం అయితే.. బాలకృష్ణుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో.. ఒకేసారి ఇంతమంది కుర్ర హీరో హీరోయిన్లు సందడి చేయడం అందరినీ ఆకట్టుకుంది. అన్నిటికంటే ముఖ్యంగా.. టాలీవుడ్ యంగ్ జనరేషన్ లో కనిపిస్తున్న ఐకమత్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఒకరి సినిమాకు మరొకరు సపోర్ట్ చేసుకుంటూ.. హద్దులు చెరిపేసుకుంటున్న తీరుకు హ్యాట్సాఫ్ అనేయచ్చు.