Begin typing your search above and press return to search.
'ఓటు' క్యూలో స్టారాధిస్టార్లు
By: Tupaki Desk | 11 April 2019 5:55 AM GMTఎలక్షన్ డే క్యూలో ఒకటే సందడి నెలకొంది. నేడు స్టారాధిస్టార్లు అంతా క్యూలో నిలబడి ఓటేయడం ముచ్చట గొలిపింది. ఏపీ - తెలంగాణలో పలు పోలింగ్ కేంద్రాల్లో స్టార్లు సందడి చేశారు. తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని సామాన్యులకు ఆదర్శంగా నిలిచారు. ఓటు వేసిన వారి జాబితాలో ఎవరెవరు ఉన్నారు? అంటే..
మెగాస్టార్ చిరంజీవి- సురేఖ దంపతులు - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - ఉపాసన దంపతులు .. కుటుంబ సమేతంగా విచ్చేసి ఓటు వేశారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 33లోని బీఎస్ ఎన్ ఎల్ పోలింగ్ బూత్ లో ఓటేశారు. ఇక జనసేనాని .. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ విజయవాడ తూర్పు నియోజకవర్గ 91 నెంబర్ పోలింగ్ స్టేషన్ కి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలుస్తోంది. అయితే ఆయన భీమవరం - గాజువాకల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.
చంద్రగిరి (మ) రంగంపేట లో మంచు మోహన్ బాబు - మంచు విష్ణు ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి జూబ్లిహిల్స్ ఓబుల్ రెడ్డి స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోసాని కృష్ణమురళి అమీర్ పేటలోని ఆయన నివాసానికి దగ్గరలోని పోలింగ్ బూత్ లో ఓటు వేశారు. వీళ్లతో పాటే ఎందరో సినీసెలబ్రిటీలు క్యూ లైన్ లో నిలబడి ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు.
ఇక స్టార్లు ఎలాంటి దర్పం లేకుండా జనంతో పాటే క్యూలో నిలబడి ఓటేయడం ముచ్చటగొలిపింది. సెలబ్రిటీ హంగామా.. ఫేజ్ 3 హైరానా ఏమాత్రం కనిపించలేదు. సామాన్యుల్లా ఓటేసి రావడం ఆకట్టుకుంది. ఇక స్టార్లతో క్యూ లైన్ లోనే ఫోటోలు దిగేందుకు ఉత్సాహం చూపించడం కాస్త ఇబ్బందికరంగా మారింది. మేం ఓటు వేసాం. అందరూ ఓటు వేయండి అంటూ స్టార్లు ప్రచారం చేయడం బాధ్యతాయుతంగా కనిపించింది.