Begin typing your search above and press return to search.

మనోధైర్యమే ఈ తారలను బ్రతికించింది

By:  Tupaki Desk   |   5 July 2018 11:39 AM GMT
మనోధైర్యమే ఈ తారలను బ్రతికించింది
X
మరణం అనేది ఈ ప్రపంచంలో ఏ జీవికి శాశ్వతం కాదు. ఇది అందరికి తెలిసిన విషయమే.. కానీ 100 ఏళ్ళు బ్రతకాల్సిన మనిషి ప్రాణాలు ఒక్కోసారి మధ్యలోనే పోతాయి అంటే వాయిదా వేసుకునేందుకు ప్రయత్నం చేస్తారు. ప్రమాదాలు రోగాలు ప్రాణాలకు ఎప్పుడు అడ్డుపడుతూనే ఉంటాయి. అయితే వాటిని జయించే వారు చాలా తక్కువ మంది ఉంటారు. ఎంత గొప్పవాడైనా కూడా చావుకు అతీతం కాదు. సినీ తారలను ఎక్కువగా క్యాన్సర్ మహమ్మారి బయపెడుతూనే ఉంటుంది.

ఇకపోతే సెలబ్రెటీలకు ఏ కష్టాలు ఉండవని అనుకోవడం ఒక్కోసారి పొరపాటే అనిపిస్తుంది. ఎంత చెట్టుకు అంతే గాలి అన్నట్టు వారికి కూడా సమస్యలు ఉంటాయి. క్యాన్సర్ బారిన పడినవారు మళ్లీ బ్రతకడం అంటే చాలా కష్టం. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైద్యం సహకరిస్తే వాటి నుంచి విముక్తి పొందవచ్చు. సీనియర్ హీరో అక్కినేని నాగేశ్వరరావు రావు దానిపై పోరాడాలని దైర్యంగా అనుకున్నారు. కానీ అందుకు వయసు సహకరించలేదు. మనం సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడు కూడా ఆయన చికిత్స చేయించుకున్నారు.

ఇక నటి గౌతమి కూడా అప్పట్లో క్యాన్సర్ తో గట్టిగా పోరాటం చేసింది. కెరీర్ తో పాటు వ్యక్తిగత ఇబ్బందులు ఉన్నప్పటికీ దైర్యంగా ముందుకు సాగి శభాష్ అనిపించుకున్నారు. ఇక మనీషా కొయిరాలా కూడా దాదాపు అలాంటి క్లిష్ట సమయంలోనే క్యాన్సర్ భయపెట్టినా కూడా ధీటుగా ఎదుర్కొన్నారు. మమత మొహన్ దాస్ కి కూడా క్యాన్సర్ ఉన్నట్లు తెలియగానే కేడి సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడు మానసిక స్థైర్యాన్ని కోల్పోగా నాగార్జున ధైర్యాన్ని ఇచ్చినట్లు చెబుతుంటారు.

ఇక రీసెంట్ గా సోనాలి బింద్రే కూడా క్యాన్సర్ బారిన పడినట్లు చెప్పి అందరికి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆమెకు ఈ వ్యాధి ఉన్నట్లు ఆలస్యంగా తెలిసినప్పటికీ తను దైర్యంగా ఎదుర్కొంటాను ఆంటోంది. ఇక క్రికెట్ ప్లేయర్స్ ఇమ్రాన్ ఖాన్ - యువరాజ్ సింగ్ కూడా గతంలో క్యాన్సర్ బారిన పడినవారే. మళ్ళీ మనోధైర్యంతో పోరాడి జీవితాన్ని కొనసాగిస్తున్నారు.