Begin typing your search above and press return to search.

గే కేసు తీర్పు: సెలెబ్రిటీలు ఏమన్నారంటే..

By:  Tupaki Desk   |   6 Sept 2018 4:45 PM IST
గే కేసు తీర్పు: సెలెబ్రిటీలు ఏమన్నారంటే..
X
సుప్రీం కోర్టు సంచలన తీర్పునిచ్చింది. స్వలింగ సంపర్కంపై ఇచ్చిన చార్మిత్రాత్మక తీర్పుపై దేశవ్యాప్తంగా స్వలింగ సంపర్కులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.దీనిపై పలువురు సెలెబ్రెటీలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సుప్రీం తీర్పుపై తాజాగా బాలీవుడ్ డైరెక్టర్లు కరణ్ జోహర్ స్పందించారు. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం స్వలింగ సంపర్కం నేరం కాదని ప్రకటించిన మరుక్షణమే ఆయన ట్వీట్ చేయడం విశేషం.

కరణ్ జోహర్ ట్వీట్ చేస్తూ.. ‘స్వలింగ సంపర్కం నేరం కాదనడం ఆనందం కలిగించింది. ఈరోజు చాలా గర్వంగా ఉంది. ఐపీసీ 377ను రద్దు చేయడం మానవాళికి సమానహక్కులకు గొప్ప విజయం. దేశానికి తిరిగి ఆక్సిజన్ లభించింది’ అంటూ పేర్కొన్నారు.

కరుణ్ ట్వీట్ ను షేర్ చేస్తూ బాలీవుడ్ సెలెబ్రెటీలు అభిషేక్ బచ్చన్ - సోనమ్ కపూర్ - అర్జున్ కపూర్ - వరుణ్ ధావన్ - స్వరభాస్కర్ - రిచా చడ్డా - దియా మీర్జా - విక్కీ కౌషల్ - ఆయుష్మాన్ ఖురాన్ లాంటి సెలెబ్రెటీలు మెచ్చుకున్నారు. తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

ప్రజలు స్వలింగసంపర్కం గురించి మాట్లాడుకుంటున్నారని అభిషేక్ బచ్చన్ ట్వీట్ చేశారు. మనదేశంలో కూడా కొంతమంది పనికొచ్చే నిర్ణయాలు చేస్తుండడం సంతోషించదగ్గ విషయం అని అర్జున్ కపూర్ ట్వీట్ చేశారు. ఇలా బాలీవుడ్ సెలెబ్రెటీలందరూ స్వలింగ సంపర్కులకు మద్దతుగా తమ అభిప్రాయాలను వెల్లడించారు.