Begin typing your search above and press return to search.

పార్టీ అన్న మనిష్ - పోలోమన్న బాలీవుడ్!

By:  Tupaki Desk   |   17 Aug 2018 6:26 AM GMT
పార్టీ అన్న మనిష్ - పోలోమన్న బాలీవుడ్!
X

మనిష్ మల్హోత్రా ఇండియాలో ఉన్న ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్స్ లో ఒకరు. 1990 లోనే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి హీరోయిన్ జుహీ చావ్లాకు కాస్ట్యూమ్స్ డిజైన్ చేయడం మొదలు పెట్టాడు. 1995 లో రిలీజ్ అయిన రామ్ గోపాల్ వర్మ సినిమా 'రంగీలా' తో అయనకు బ్రేక్ వచ్చింది. అందులో హీరోయిన్ ఊర్మిళకు డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ మనిష్ కు మంచి పేరు తీసుకొచ్చాయి. అప్పటి నుండి ఇప్పటివరకూ బాలీవుడ్ లో ని టాప్ స్టార్స్ అందరికీ కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్నాడు.

ఫ్యాషన్ డిజైనర్ గారి ఇంట్రడక్షన్ అయిపోయింది. ఇక ఈయన లాస్ట్ ట్యూస్ డే ముంబైలోని తన నివాసంలో ఒక పెద్ద పార్టీ ఇచ్చాడు. దాదాపు బాలీవుడ్ అంతా అక్కడ వాలిపోయింది. ప్రియాంక చోప్రా లాంటి గ్లోబల్ సుందరితో మొదలు పెడిది లస్ట్ స్టోరీస్ బ్యూటీ కియారా అద్వాని వరకూ అందరూ వచ్చారు. జాన్వి కపూర్ - ఖుషి కపూర్ - సారా అలీ ఖాన్ - సోనాక్షి సిన్హా - అనన్య పాండే ఇలా యంగ్ బ్రిగేడ్ అంతా పార్టీలో సందడి చేసింది.

ఇక కరణ్ జోహార్ లాంటి సీనియర్లు - ఆదిత్య రాయ్ కపూర్ - జాకీ ష్రాఫ్ - ఇషాన్ ఖట్టర్ - విక్కీ కౌశల్ లాంటి అబ్బాయిలు కూడా ఉన్నారు. అందరూ అల్ట్రా స్టైలిష్ డ్రెస్సుల్లో మెరిసిపోయారు. అసలే మనిష్ ఇంట్లో పార్టీ. లుంగీ-ధోతీలు.. లంగా జాకెట్లు వేసుకొని వెళ్తే అయన ఊరుకుంటాడా.. ?

పార్టీలో ఎంతమంది ఉన్నా నిక్కు రింగు మాత్రం హైలైట్ అట. అదేనండీ అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ మన బాలీవుడ్ నటీమణి ప్రియాంక చొప్రా ఉంగరం వేలికి తొడిగిన ఎంగేజ్ మెంట్ రింగు. ఉత్త రింగే కదా అని మీరు నవ్వుకోవద్దు.. 'రింగు' కాన్సెప్టు తో 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' అని హాలీవుడ్దోళ్ళు సినిమా సిరీస్ తీసి వందలకోట్లు కొల్లగొట్టారు.. అదీ రింగు మహత్యం..!