Begin typing your search above and press return to search.
‘బాహుబలి’ భజన మరీ అంతగానా?
By: Tupaki Desk | 4 May 2017 11:00 AM GMTసినిమా వాళ్లు ‘బాహుబలి: ది కంక్లూజన్’ చూసి అబ్బుర పడటంలో.. దాని మీద పొగడ్తలు గుప్పించడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఈ క్రమంలో కొందరు శ్రుతి మించిపోతున్నారు. దాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ రాజకీయ నాయకులు సైతం ‘బాహుబలి’ భజనలో తరించిపోతుండటం.. దీని గురించి అతి చేసి మాట్లాడుతూ మైలేజీ పొందాలని చూస్తుండటమే ఆశ్చర్యం కలిగించే విషయం.
మొన్న కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ‘బాహుబలి: ది కంక్లూజన్’ చూశారు. దాన్ని పొగిడారు. అది కూడా మామూలుగా కాదు.. ‘బెన్ హర్’.. ‘టెన్ కమాండ్మెంట్స్’ లాంటి ఆల్ టైం హాలీవుడ్ క్లాసిక్ సినిమాలతో. ఇక ఇలాంటి విషయాల్లో చాలామంది నాయకుల కంటే రెండాకులు ఎక్కువే చదివిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంకొన్ని అడుగులు ముందుకే వేశారు. ‘బాహుబలి’ని ఆస్కార్ కు పంపిస్తాం అనేశారు. ఆస్కార్ అవార్డులకు మన సినిమాల్ని నేరుగా నామినేట్ చేసే అవకాశం కూడా ఉండదని.. అది కూడా ఏపీ ప్రభుత్వం పంపదని ఆయనకు తెలియదు కాబోలు. అమరావతిలో ఒలింపిక్స్ నిర్వహిస్తాం అని ప్రకటన చేసినట్లే ఆస్కార్ కు పంపించేస్తాం అని ఆయన అలవోకగా అనేశారు.
‘బాహుబలి’ మన ఇండియన్ సినిమా ప్రమాణాలతో పోలిస్తే గొప్పగానే అనిపించొచ్చు. ఐతే కేవలం గ్రాఫిక్స్.. విజువల్ ఎఫెక్ట్స్ మాయాజాలం ఉంటే ఆస్కార్ అవార్డులిచ్చేయరు. కథాకథనాలు గొప్పగా ఉండాలి. ప్రపంచ స్థాయిలో ఉండాలి. ‘బాహుబలి’ మామూలు కథ అని ఎవరైనా అంగీకరించాల్సిందే. ఇక్కడ మనల్ని ఆకట్టుకున్నది విజువల్ మాయాజాలమే. అవి ప్రపంచ స్థాయిలో ఉన్నాయి కాబట్టి ఆస్కార్ అవార్డులు వరించేస్తాయని అనుకుంటే ఎలా? ‘బెన్ హర్’ లాంటి సినిమాలతో పోల్చేస్తే ఎలా?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/