Begin typing your search above and press return to search.
దీపిక వాట్సాప్ లో మెసేజులు మోత
By: Tupaki Desk | 23 July 2015 4:14 PM GMTపొడుగు కాళ్ల సుందరి దీపిక ఏం చేసినా అందులో సంథింగ్ ఉంటుంది. ఇటీవలి కాలంలో చెన్నయ్ ఎక్స్ ప్రెస్, హ్యాపీ న్యూ ఇయర్, పీకూ వంటి చిత్రాల్లో అభినయానికి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే ఇవన్నీ రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలు. కానీ ఇప్పుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఓ హిస్టారికల్ చిత్రంలో నటిస్తోంది. 'భాజీ రావ్ మస్తానీ' అనేది టైటిల్. ఇందులో డిప్స్ మస్తానీ పాత్రలో నటిస్తోంది.
ఇటీవలే టీజర్ రిలీజైంది. ఈ టీజర్ లో దీపిక కరవాలం తిప్పుతూ వీరత్వం ప్రదర్శించింది. కత్తి ఫైటింగులు, బాణాలతో శతృవులను చండాడటం, కర్రలతో సాము చేయడం.. అబ్బో ఇలా అన్నిరకాల విద్యల్ని ప్రదర్శించింది. డిప్స్ కత్తి పట్టిన తీరు చూస్తే ఓ రాకుమారిని తలపించిందని అంతా పొగిడేస్తున్నారు. అయితే ఈ టీజర్ రిలీజ్ అయినప్పటి నుండీ ఇక అమ్మడి ఫోను మోగుతూనే ఉందట. అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు చాలామంది సెలబ్రిటీలు ఫోన్ చేసి అభినందిస్తున్నారట.
ప్రస్తుతం దీపిక మొబైల్ వాట్సాప్ లో మెసేజ్ లే మెసేజ్ లు. వీటిని చదవడానికే రోజంతా సరిపోవడం లేదుట. అసలే ఆన్ సెట్స్ తీరిక లేకుండా ఉన్న ఈ అమ్మడు పదే పదే ఫోన్ లో మెసేజ్ లు చదువుకుంటూ టైమ్ వేస్ట్ చేస్తుంటే ఇతరులకు కాస్త ఇబ్బందిగానే ఉంది. అయినా ఏం చేస్తాం. దీపిక తనని అభిమానించేవారికి తిరిగి రిప్లయ్ ఇవ్వడాన్ని ధర్మంగా భావించి తిరుగు మెసేజ్ లు పెడుతోందిట. ఇంతకీ తన లవరు రణవీర్ నుంచి ఎలాంటి ప్రశంస వచ్చిందో మరి?