Begin typing your search above and press return to search.

రాఖీ వేళ సెలబ్స్‌ శంకరాభరణమిది

By:  Tupaki Desk   |   29 Aug 2015 7:26 AM GMT
రాఖీ వేళ సెలబ్స్‌ శంకరాభరణమిది
X
బ్రదర్స్‌ అండ్‌ సిస్టర్స్‌ రిలేషన్‌ షిప్‌ కి ప్రతీక రాఖీ పండుగ. ఈరోజు అన్నజెల్లెళ్లు, అక్కా తమ్ముళ్లు సెలబ్రేషన్స్‌ పీక్స్‌ లో ఉన్నాయి. అయితే సెలబ్రిటీల్లో ఈ పండుగ ఎలా ఉంది? అన్నది తెలుసుకోవాలని ప్రయత్నిస్తే...

నా బ్రదర్‌ నా గిఫ్ట్‌. అందుకే అతడిని ఇంకేమీ అడగను. ఈసారి షూటింగ్‌ కోసం హైదరాబాద్‌ లో ఉన్నా. తమ్ముడిని ఇక్కడికే వచ్చేయమన్నా.. అని చెబుతోంది రకూల్‌ ప్రీత్‌. శంకరాభరణం షూటింగ్‌ కోసం మహారాష్ట్రలోని ఇంటీరియర్‌ ప్లేస్‌ లో ఉన్నా.. అందుకే ఈసారి రాఖీని సెలబ్రేట్‌ చేసుకోలేదు. ఫోన్‌ లోనే విషెస్‌ అంటూ చెబుతున్నాడు నిఖిల్‌. అక్కా చెల్లెళ్లు పుట్టేది బ్రదర్స్‌ నుంచి డిమాండ్‌ చేసేందుకే. నేను లక్ష్మీ ప్రసన్నకు ఖాళీ చెక్‌ ఇచ్చేవాడిని. తనకి కావాల్సినంత రాసుకోమని.. అని చెప్పాడు విష్ణు. ఈసారి లక్ష్మీకి, తన కూతురు విద్యా నిర్వాణకి బోలెడన్ని బహుమతులు కొనిచ్చానని విష్ణు చెప్పాడు.

నా సోదరి లండన్‌ లో చదువుకుంటోంది. అక్కడి నుంచి రాఖీ పంపించింది. తనే నా బెస్ట్‌ క్రిటిక్‌ కూడా అంటూ సందీప్‌ కిషన్‌ చెప్పాడు. ప్రస్తుతం స్వీడెన్‌ లో షూటింగులో ఉన్నా. నా బ్రదర్‌ మర్చంట్‌ నావీ ఉద్యోగి. చివరిసారి రాఖీకి ఐఫోన్‌ గిఫ్టుగా ఇచ్చాడు. ఈసారి మిస్సయ్యానని చెబుతోంది రాశీఖన్నా. ఇద్దరు బ్రదర్స్‌ లో ఒకరు హైదరాబాద్‌ లో, ఇంకొకరు న్యూజిలాండ్‌ లో. ఇప్పటికే న్యూజిలాండ్‌ కి రాఖీ పంపించా. అక్కడి నుంచి క్యాష్‌ వచ్చింది అంటూ చెప్పుకొచ్చింది మధుశాలిని. భయ్యాతో కలిసి ముంబైలో రక్షా బంధన్‌ సెలబ్రేట్‌ చేసుకుంటున్నానని హన్సిక చెప్పింది. నా రాఖీ నా చెల్లాయికే కట్టేశా. రక్షాబంధన్‌ సిబ్లింగ్స్‌ కి సంబంధించినదని నా అభిప్రాయం అని చెబుతోంది కృతిసనోన్‌. అక్కతో ఎప్పుడూ గొడవ పడకపోవడమే నేనిచ్చిన గిఫ్ట్‌ అంటూ అక్షయ్‌ కుమార్‌ చెప్పాడు.