Begin typing your search above and press return to search.
సెల్యూట్ సెల్యూట్ : స్టార్లు అదరహో
By: Tupaki Desk | 15 Aug 2015 9:48 AM GMT200 సంవత్సరాలు ఆంగ్లేయులు మన దేశాన్ని ఏలారు. వాళ్లని తరిమి కొట్టడం కోసం ఎందరో దేశభక్తులు ప్రాణత్యాగం చేశారు. తిరుగుబాటు దారుల్ని, తీవ్రవాదులుగా పేర్కొంటూ బ్రిటీష్ ప్రభుత్వాలు హత్యలు చేశాయి. అయినా అన్నిటినీ ఎదురొడ్డి మహాత్ముడు ఈ దేశానికి స్వాతంత్య్రాన్ని అందించాడు. అందుకే ఆ స్వాతంత్య్ర ఫలాల్ని అనుభవిస్తూ ఈ రోజు హీరోలుగా చెలామణి అయిపోతామంటే కుదరదు. గతాన్ని తవ్వుకుని భవిష్యత్ కి పునాదులు వేసుకోవాలి. అందుకే మన స్టార్లంతా యునానిమస్ గా స్పందించారు. ప్రతి ఒక్కరూ మువ్వన్నెల జెండాకి శాల్యూట్ కొట్టారు.
పవన్ కల్యాణ్, మహేష్ జెండావందనం పూర్తయింది. ఎవరికి వారు మువ్వన్నెల జెండాని గౌరవిస్తూ శాల్యూట్ చేశారు. ఈ ఇద్దరేనా .. టాలీవుడ్ లో ఉన్న డజను మంది శాల్యూట్ చేసి దేశభక్తిని చాటుకున్నారు. రానా - నాని - అఖిల్ - నాగచైతన్య - ఉపేంద్ర - సుమంత్ - నవదీప్ - జయం రవి - జీవీ ప్రకాష్ - రాధిక ఆప్టే - బిందుమాధవి ఇంతమంది శాల్యూట్ పొజిషన్ లో ఫోజులిచ్చి కనిపించారు. ఆన్ లైన్ లో ఈ ఫోటోలన్నీ హల్ చల్ చేస్తున్నాయి. దేశం కోసం పోరాటం చేసిన వీరులందరికీ ఇదే మా వందనం అని చెప్పకనే చెప్పారు. ఆ మాత్రం చాలు దేశభక్తి తెలుగువాడి నరనరాల్లో ఇంకి ఉందని చెప్పడానికి.