Begin typing your search above and press return to search.

మన స్టార్లంటే... హ్యాకర్లకు ఎంత మోజో

By:  Tupaki Desk   |   22 Dec 2015 5:30 PM GMT
మన స్టార్లంటే... హ్యాకర్లకు ఎంత మోజో
X
తన అకౌంట్ హ్యాక్ అయిందంటూ.. ఎన్టీఆర్ చేసిన ట్వీట్ తో హ్యాకింగ్ మరోసారి హాట్ టాపిక్ అయింది. సెలబ్రిటీల అకౌంట్లను ఎటాక్ చేయడం, వాటిని హ్యాక్ చేయడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. కానీ మన టాలీవుడ్ విషయంలో మాత్రం హ్యాకర్లు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. అదేంటో చదవండి..

సాధారణంగా అకౌంట్ హ్యాక్ చేస్తే.. అది తమ విజయంగా చెప్పేందుకు.. ఈ అకౌంట్ ను హ్యాక్ చేశామనే పోస్ట్ పెడుతూ ఉంటారు హ్యాకర్లు. మరికొంత మంది అడల్ట్ కంటెంట్ నో, అసభ్యకరమైన మెసేజ్ నో, ఆయా స్టార్ల పర్సనల్ ఫోటోలనో పోస్ట్ చేసి ఇబ్బంది పెడుతూ ఉంటారు. కానీ మన స్టార్ హీరోల విషయంలో వింతగా ఉంది వీరి ప్రవర్తన. అదేంటో అర్ధం కాదు కానీ.. ఆయా స్టార్లకు సంబంధించిన అభిప్రాయాలు - అప్ డేట్స్ ని పోస్ట్ చేసేస్తున్నారు.

గతంలో మహేష్ బాబు విషయంలో ఇలాగే జరిగింది. మాటీవీ నిర్వహించే అవార్డుల ఫంక్షన్ ని బిజినెస్ మ్యాన్ ని ఎంపిక చేయకపోవడానికి కారణం.. తను అందుబాటులో లేకపోవడమేనని, బహుశా వ్యక్తిగతంగా అవార్డ్ వస్తేనే వస్తారనుకుంటా అనే పోస్ట్ మహేష్ ట్విట్టర్ వాల్ లో దర్శనమిచ్చింది. దీనిపై దుమారం చెలరేగడంతో, అంతలోనే తన అకౌంట్ హ్యాక్ అయిందంటూ, అవి తన అభిప్రాయాలు కాదని క్లారిటీ ఇచ్చాడు సూపర్ స్టార్.

ఇప్పుడు ఎన్టీఆర్ విషయంలోనే ఇంతే. నాన్నకు ప్రేమతో మూవీ, ఆడియో ఎప్పుడు రిలీజ్ అవుతాయో అంటూ చేతులెత్తేసినట్లుగా పోస్ట్ కనిపించగానే.. యంగ్ టైగర్ నుంచి కూడా సేమ్ టైపులో ట్వీట్ పడింది. ఏమైనా సరే., ఈ హ్యాకర్స్ టాలీవుడ్ స్టార్లను బాగా ఫాలో అయిపోతున్నారు. ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి.. వీళ్లలో ఎవరూ తమ అకౌంట్ హ్యాక్ అయిన విషయాన్ని, ఏ సైబర్ క్రైమ్ ఆఫీస్ లోనూ రిపోర్ట్ చేయలేదు. ఎందుకంటారూ ?