Begin typing your search above and press return to search.

బ్రహ్మోత్సవం: ఎవరేమన్నారంటే... 2

By:  Tupaki Desk   |   7 May 2016 4:32 PM GMT
బ్రహ్మోత్సవం: ఎవరేమన్నారంటే... 2
X
''బ్రహ్మోత్సవం'' సినిమా ఆడియో లాంచ్‌ లో భాగంగా.. చాలా మంది దిగ్గజాలు.. హీరోయిన్లు.. విలక్షణ నటులు.. చాలా మాటలే చెప్పారు. వారు ఏమన్నారో చూద్దాం పదండి.

''ఒక పెద్ద విషయం తల మీద వేసుకున్నప్పుడు పెద్ద హీరోల ప్రోత్సాహం ఎప్పుడూ ఉండాలి. అలాంటి ప్రోత్సాహం మహేష్‌ బాగా ఇస్తారు. ఎప్పుడైనా నాకు కొంచెం భయంగా ఉన్నప్పుడు వెనక్కి తిరిగి చూస్తే.. అక్కడ నవ్వుతూ మహేష్‌ బాబు కనిపించేవారు. అదే నాకు కొండంత బలం'' అని చెప్పారు దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల. ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ.. తోట తరణి అండ్‌ సినిమాటోగ్రాఫర్‌ రత్నవేలుకు థ్యాంక్స్‌ చెప్పారు. ''మనం తింటూ పదిమందికి భోజనం వడ్డించడం అనే పెద్ద విషయాన్ని నాకు నేర్పిన ఆర్ట్ డైరక్టర్‌ తోట తరణి గారికి ధన్యవాదాలు'' అంటూ ముగించాడు.

''శ్రీకాంత్‌ అద్భుతమైన స్ర్కిప్టు.. ముగ్గురు బ్యూటిఫుల్‌ హీరోయిన్లు.. రేవతి, సత్యరాజ్‌, జయసుధ, రావు రమేష్‌ గారు.. అదరగొట్టారు. గడచిన 20 సంవత్సరాల్లో నా కెమెరా క్యాప్చుర్‌ చేసిన అద్భుతమైన హ్యండ్సమ్‌ హీరో మహేష్‌ బాబు'' అని సినిమాటోగ్రాఫర్‌ రత్నవేలు సెలవిచ్చారు.

ఇక మాటల రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. ''మాకు తెలుగు సినిమా ఇండస్ర్టీలో ఇద్దరు దేవుళ్లు. ఒకరు ఎన్టీఆర్‌. ఇంకొకరు కృష్ణ. మమ్మల్ని వారు ఈ ఇండస్ర్టీకి ఇంట్రొడ్యూస్‌ చేశారు. ఆయన తరువాత మహేష్‌ ఆయన ఊహించిన స్థాయిని మించిపోయాడు. తన చిన్నప్పటి నుండి ఇప్పటివరకు తనతో అసోసియేట్‌ అవ్వడం మా అదృష్టం. మన భారతదేశ జనాభా దగ్గర అమెరికాను కొనేసేంత డబ్బులేదేమో కాని.. మహేష్‌ చిరునవ్వు చాలు మన అమెరికాను కొనేయడానికి'' అన్నారు.

పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ''మా తమ్మడు మహేష్‌ గురించి చెప్పేశాడు కాబట్టి నేను ప్రత్యేకించి చెప్పట్లేదు. ఇక దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల మానవతా విలువలు అంటూ సాగే ఒక కొత్త స్కూల్‌ ఓపెన్‌ చేశాడు. అద్భుతమైన దర్శకుడు'' అన్నారు.