Begin typing your search above and press return to search.

జెండా పేరుతో మీ సొంత ప్రమోషనా??

By:  Tupaki Desk   |   15 Aug 2017 7:58 AM GMT
జెండా పేరుతో మీ సొంత ప్రమోషనా??
X
ప్రచారం అంటే జనాల ఆలోచనలుకు తగ్గట్లు చేయాలని చెబుతారు. అలా అన్నంత మాత్రాన ప్రతిదానిలోనూ మన పనిని ప్రచారం చేసుకుంటే ఏమి బాగుంటుంది చెప్పండి. మన పని గురించి చెప్పుకోవడానికి ఒక సమయం ఉంటుంది ఒక సందర్భం వస్తుంది. అప్పుడు మన పని గురించి మాట్లాడితే దానికి ఒక అర్ధం ఉంటుంది. కానీ మన స్టార్లు కొంచెం ఉత్సాహం ఎక్కువై ఇప్పుడు సమయం సందర్భం చూడకుండా వాళ్ళ సినిమాలను వాళ్ళ పనిని ప్రచారం చేసుకుంటున్నారు. ఈ రోజు మన దేశంకు స్వేచ్చ వచ్చిన రోజు కాబట్టి అందరం కలిసి పండుగ చేసుకుంటున్నం బాగానే ఉంది. ఈ పండుగ రోజును కూడా కొంతమంది వాళ్ళ సినిమా ప్రమోషన్ కు వాడేస్తున్నారు.

అవకాశవాదం అనేది ఎక్కడ మీరు చూడకపోయాన బిజినెస్ లో మాత్రం అది మీకు కనిపిస్తుంది. ఇక్కడ కొంతమంది స్టార్లు వాళ్ళ సినిమాని ఈ విదంగా ప్రచారం చేసుకుంటున్నారు. వాళ్ళ అభిమానులకు ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు చెప్పడం ఎవరు తప్పుపట్టరు కానీ వాళ్ళ సినిమాను ఈ రోజు కోసమే నిర్మించినట్లు ప్రచారం చేస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం అంటే దేశ జెండాను చూపిస్తే చాలు.. దాని పక్కనే వీళ్ల ప్రమోషన్లు ఏంటో అర్ధాంకావటంలేదు. ఇలాంటి స్వార్ధంతో కూడిన విషెస్ అసలు నిజమైన ఇండిపెండెన్స్ డే కు చిహ్నాలేనా?? అని సందేహం వస్తుంది. వీళ్ళు మనకు విషెస్ చెబుతున్నారా లేక వాళ్ళ రాబోయే సినిమా విశేషాలు చెబుతున్నారో తెలియటంలేదు. వీళ్లది ఇప్పుడు అవకాశవాదమని అనాల లేక దేశం పై అభిమానం అనాల మీరే చెప్పండి.

ఇప్పుడే విడుదలైన ఒక సినిమా పోస్టర్ ను జెండా పట్టుకున్నట్లు, రాబోయే ఒక సినిమా దేశం కోసమే తీస్తున్నాం అనే భావన కలిపిస్తూ కొన్ని పోస్టర్లు విడుదల చేశారు మన స్టార్లు. మరి కొంతమంది అయితే వాళ్ళ ప్రొడక్షన్ కంపెనీని కూడా ప్రోమోట్ చేసుకుంటున్నారు. మీరు మారరా??