Begin typing your search above and press return to search.

షిమ్లా బ్యూటీకి మళ్లీ కవలలే!!

By:  Tupaki Desk   |   25 May 2017 5:28 AM GMT
షిమ్లా బ్యూటీకి మళ్లీ కవలలే!!
X
షిమ్లా సుందరాంగి సెలీనా జైట్లీ.. తన కెరీర్ ప్రారంభంలో ఓ తెలుగు మూవీలో నటించింది. మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు హీరోగా రూపొందిన రెండో సినిమా సూర్యంలో హీరోయిన్ గా నటించింది సెలీనా జైట్లీ. ఆ తర్వాత బాలీవుడ్ లో కుదురుకుపోయిన ఈ భామ.. మళ్లీ తెలుగు వైపు కన్నెత్తి చూడలేదు. ఇక్కడి నుంచి కూడా అవకాశాలు అందలేదు.

2001 మిస్ ఇండియా టైటిల్ విన్నర్ అయిన సెలీనా జైట్లీ.. అదే ఏడాది మిస్ యూనివర్స్ కాంపిటీషన్ లో నాలుగో స్థానంలో నిలిచింది. అక్కడి నుంచి సినిమా అవకాశాలు వరుసగా రావడంతో.. పదేళ్ల పాటు బాలీవుడ్ లో బాగానే వెలుగులు విరజిమ్మి.. 2011లో పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. ఓ వ్యాపారవేత్తను పెళ్లాడిన సెలీనా జైట్లీ.. 2012లో కవల మగ పిల్లలకు జన్మనిచ్చింది. 2012 మార్చ్ లో తమకు పుట్టిన పిల్లలకు విన్ స్టన్.. విరాజ్ అని పేర్లు పెట్టుకున్నారు సెలీనా జంట.

ఇప్పుడీ 35 ఏళ్ల భామ మరోసారి గర్భంతో ఉంది. అయితే.. రెండోసారి కూడా కవలలే పుట్టనుండడం ఈమెకు తెగ సంతోషం ఇచ్చేస్తోంది. తాజాగా అల్ట్రాసౌండ్ స్కాన్ తీయించుకున్నపుడు ఈ విషయం తెలిసిందట. వరుసగా రెండు సార్లు కవలలకు జన్మనిచ్చిన అరుదైన మహిళల్లో తాను కూడా ఒఖరు అని తెగ సంబరపడిపోతోంది సెలీనా జైట్లీ. అక్టోబర్ లో డెలివరీ డేట్ ఇచ్చినట్లు డాక్టర్లు చెప్పారంటోంది ఈ మాజీ మిస్ ఇండియా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/