Begin typing your search above and press return to search.
విడుదల ముంగిట 2.0 వివాదం
By: Tupaki Desk | 28 Nov 2018 6:33 AM GMTరేపు ఈ సమయానికల్లా సోషల్ మీడియాతో పాటు ఆన్ లైన్ మొత్తం 2.0 రిపోర్ట్స్ ట్వీట్స్ రివ్యూస్ తో హోరెత్తిపోవడం ఖాయం. తమిళనాడు కంటే ఎక్కువగా తెలుగు రాష్ట్రాలలోనే భారీ స్థాయిలో విడుదల కానున్న 2.0 అడ్వాన్సు బుకింగ్ పరంగా సంచలనం రేపుతోంది. హీరో దర్శకుడి కాంబో కన్నా విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కువ హైప్ వచ్చేలా చేస్తున్నాయి. ఇక మొదటి షో పడడానికి సమయం గంటల్లోకి మారిపోగా కొత్తగా వచ్చిన వివాదం ఇబ్బంది పెట్టేలా కనిపిస్తోంది. 2.0లో సెల్ ఫోన్స్ తో పాటు మొబైల్ నెట్ వర్క్ లు పర్యావరణానికి హానీ కలిగించేలా ఉంటాయన్న కాన్సెప్ట్ తో సినిమా తీసారని ఆరోపిస్తూ సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ అఫ్ ఇండియా సెంట్రల్ మినిస్ట్రీకి ఫిర్యాదు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.
రీ సెన్సార్ చేసి తాము ఆరోపించిన అంశాలు ఉన్నాయా లేదా చెక్ చేయాలనీ కోరుతూ అందులో పేర్కొన్నారు. సత్వరం చర్య తీసుకోవాల్సిందిగా కోరారు. అడిగింది చిన్న సంస్థ కాదు కాబట్టి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడు ఈ వివాదం ఎందుకు వచ్చింది అనేది పక్కన పెడితే ట్రైలర్ లో ఈ పాయింట్ ని టచ్ చేసిన మాట వాస్తవం. అక్షయ్ కుమార్ పోషించిన పక్షి రాజు పాత్ర ద్వారా సెల్ ఫోన్ వాడాలంటే ప్రతి ఒక్కరు భయపడాలి అని చెప్పించడం దీనికి బలమిచ్చేలా ఉంది.
సెల్ టవర్ల రేడియేషన్ వల్లే అక్షయ్ కుమార్ అలా వికృతంగా మారిపోయి దారుణాలకు పాల్పడతాడనే టాక్ ఇప్పటికే ఉంది. సో నెట్ వర్క్ ఆపరేటర్లు ఇచ్చిన కంప్లైంట్ లో పాయింట్ అయితే ఉంది. మరి కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ దీని పట్ల ఎలా స్పందిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. సెన్సార్ ఇచ్చే సమయంలోనే ఇలాంటి కొన్ని కట్స్ ఇచ్చిన నేపధ్యంలో ఒకవేళ నిజంగా రీ సెన్సార్ జరిగితే మరికొన్ని కోతలు తప్పవు.