Begin typing your search above and press return to search.
'సైరా' కోసమే నంది అవార్డుల ప్రస్తావన వచ్చిందా...?
By: Tupaki Desk | 10 Jun 2020 9:50 AM GMTటాలీవుడ్ సినీ ప్రముఖుల బృందం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ లో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసి ఇండస్ట్రీ అభివృద్ధి కోసం పలు అంశాలపై చర్చించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కొన్నేళ్లుగా ఆగిపోయిన నంది అవార్డుల ప్రధానోత్సవం పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన చిరంజీవి వెల్లడించారు. చిరు మాట్లాడుతూ నంది అవార్డులు చాన్నాళ్లుగా పెండింగ్ లో ఉన్నాయి. ప్రభుత్వం నుంచి అవార్డులు ఇచ్చి ప్రోత్సహించాలని అంతా కోరుకుంటారు. దీనిపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వెంటనే స్పందించారు. 2019-20 సంవత్సరానికి సంబంధించిన నంది అవార్డులు ఇవ్వడానికి నిర్ణయించారు. ఈ ఏడాదిలోనే నంది అవార్డుల వేడుక చోటు చేసుకునే అవకాశం ఉంది" అని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత మాట్లాడిన మినిస్టర్ పేర్ని నాని ''ప్రభుత్వం నుంచి సినీ కళాకారులకు రావాల్సిన ప్రోత్సాహం ఏ పరిస్థితుల్లోనూ ఆగొద్దని సీఎం గారు చెప్పారని.. 2019 సంవత్సరానికి సంబంధించి నంది అవార్డుల ప్రధానోత్సవాలు పెండింగ్ లో ఉన్న విషయాన్ని చిరంజీవి గుర్తు చేశారు. వారి విజ్ఞప్తిపై స్పందించిన సీఎం జగన్.. అలాగే జరుపుతామని చెప్పడం జరిగిందని'' పేర్కొన్నారు. అయితే ఇప్పుడు నంది అవార్డుల ప్రధానోత్సవం గురించి డిస్కస్ చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఏటా ప్రభుత్వం నంది అవార్డులను ప్రధానం చేస్తూ వచ్చింది. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమాలు జరగడంతో ప్రభుత్వం నంది అవార్డుల కార్యక్రమాన్ని వాయిదా వేసింది. అయితే ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2017లో 2014 - 2015 - 2016 సంవత్సరాలకి గానూ నంది అవార్డులను ప్రకటించింది. కాకపోతే బాలయ్య నటించిన 'లెజెండ్' సినిమాకు ఎక్కువ నంది అవార్డులు ఇవ్వడంతో ప్రభుత్వం పక్షపాతంతో అవార్డులను ప్రకటించిందని తీవ్ర విమర్శలొచ్చాయి. దీంతో నంది అవార్డుల కార్యక్రమాన్ని అప్పటి ప్రభుత్వం నిలిపివేసింది. అయితే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం 2019 సంవత్సరానికి నంది అవార్డులను ఇవ్వడానికి సిద్ధమని సినీ పెద్దలకు చెప్పుకొచ్చింది. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొనియున్న పరిస్థితుల వలన ప్రజలు కష్టాలు పడుతున్నప్పుడు.. కరోనా దెబ్బకి ఇండస్ట్రీ తీవ్ర సమస్యలు ఎదుర్కుంటున్న సమయంలో అవార్డుల గురించి డిస్కస్ చేయడం ఏంటని సినీ పెద్దలపై కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాకుండా కేవలం మెగాస్టార్ చిరంజీవి తన 'సైరా నరసింహారెడ్డి' సినిమాకి అవార్డు పొందడం కోసమే ఇప్పుడు ఈ విషయాన్ని తెర మీదకి తీసుకొచ్చారని కామెంట్స్ చేస్తున్నారు. 2019 సంవత్సరానికి నంది అవార్డులు ప్రకటిస్తే 'సైరా' సినిమాకి కచ్చితంగా అవార్డులు వస్తాయన్న కారణంతోనే ఇలాంటి సమయంలో అవార్డు వేడుకల గురించి ప్రభుత్వంతో డిస్కస్ చేసారని విమర్శిస్తున్నారు. మరి ఈ కామెంట్స్ పై ఇండస్ట్రీ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి.