Begin typing your search above and press return to search.

ఈ సెన్సార్ సెన్సారింగేంటో నాయనో

By:  Tupaki Desk   |   18 April 2017 6:47 AM GMT
ఈ సెన్సార్ సెన్సారింగేంటో నాయనో
X
మన దేశంలో సెన్సార్ బోర్డు సినిమా వాళ్ళని ఒక మాదిరిగానే హింస పెట్టేస్తోంది. దేనికోసం ఎందుకు వద్దంటారో తెలిస్తే ఒక రకమైన ఏవగింపు వస్తుంది. కొన్ని బూతులు మాట్లాడకూడదు కానీ అని అవి మనకు అర్ధం అవుతాయి.. కొన్ని పనులను ప్రోత్సహించకూడదు అంటారు కానీ చూసినవాడికి చాల బాగా తెలిసిపోతుంది. మరీ దేన్నీ వీళ్ళు వద్దు అని చెబుతున్నారో ఎవ్వరికీ అంతుపట్టడం లేదు. వీళ్ళకి ఏది ఎలా ఎక్కడ వద్దు అని చెప్పాలో బొత్తిగా తెలిసినట్లు లేదు.

ఆ మధ్య ‘ఉడతా పంజాబ్’ వచ్చింది కదా ఈ సినిమా కు సెన్సార్ పెట్టిన పాట్లు ఇంకా చెప్పక్కరలేదు. ఇప్పుడు కొత్తగా వస్తున్న సోనక్షి సిన్హా 'నూర్' సినిమాలో కొన్ని అవాంచిత పదాలు ఉన్నాయని.. వాటిని తొలిగించాలని అని చెప్పింది. అవి ఏంటో కాదు ఈ సినిమా లో కధానాయక ఒక జర్నలిస్ట్ కాబట్టి కొన్ని సందర్భంలో 'సెక్స్ టాయ్స్' మరియు 'దళిత్' అనే పదాలు వాడిందట.. అవి తీసేసి వేరే పదాలు పెట్టండి అని చెప్పింది. ఇంతకుముందు మద్యం సిగరెట్ ఇలాంటివి నిషేధించేవారు. కాని ఇప్పుడు మాత్రం దేన్ని తీసేయమంటున్నారో ఎవరికీ అంతుపట్టడం లేదు. సెన్సార్ కి కనీస సెన్స్ ఉండదు అని దీంతో రుజువు అయింది.

ఇప్పుడు ఇంటర్నెట్ లో లేనిది.. దొరకనది ఏమి ఉంది? మరి వీళ్ళు ఏ రూల్స్.. ఎథిక్స్ ఫాలో అవుతున్నారో కానీ పాత మంత్రం కొత్త జబ్బు కి పనికివస్తుందా చెప్పండి!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/