Begin typing your search above and press return to search.
793 సినిమాలు సెన్సార్ కత్తెర వల్ల కనుమరుగు
By: Tupaki Desk | 20 Feb 2019 10:52 AM GMTఇండియాలో సెన్సార్ బోర్డు ఉంది కనుక బతికి పోయాం లేదంటే బూతు సినిమాలు, చంపుకోవడాలు, నరుక్కోవడాలే ఎక్కువగా చూపించేవారు. సెన్సార్ కు భయపడి సినిమాలను నిర్మిస్తున్నారు. అతిగా శృంగారం చూపించినా, అతిగా హింస చూపించినా కూడా సినిమా విడుదల అవ్వదేమో అనే భయంతో నిర్మాతలు సినిమాను కాస్త పద్దతగా తీస్తున్నారు. సెన్సార్ రూల్స్ పాటించని కారణంగా 16 ఏళ్లలో ఏకంగా 793 సినిమాలు విడుదలకు నోచుకోలేదు. కనీసం సెన్సార్ బోర్డును కూడా దాటని ఈ సినిమాలు ఇక ఎప్పటికి కూడా విడుదల అవ్వవు.
ఆర్టీఐ కార్యకర్త నూతన్ ఠాకూర్ సీబీఎఫ్ సీని సెన్సార్ విషయంలో ప్రశ్నించాడు. ఇప్పటి వరకు 2001 జనవరి నుండి 2016 సంవత్సరం వరకు ఎన్ని సినిమాలు బ్యాన్ అయ్యాయి అంటూ ప్రశ్నించాడు. ఈ 16 ఏళ్లలో 586 ఇండియన్ సినిమాలను బ్యాన్ చేసిన సెన్సార్ బోర్డు 207 విదేశీ సినిమాలను ఇండియాలో విడుదల అయ్యేందుకు అనుమతి నిరాకరించింది.
బ్యాన్ అయిన ఇండియన్ సినిమాల్లో ఎక్కువగా హిందీ సినిమాలు ఉన్నాయి. 231 హిందీ సినిమాలు సెన్సార్ గేటు దాటలేక పోయాయి. ఆ తర్వాత 96 తమిళ సినిమాలు, 53 తెలుగు సినిమాలు, 39 కన్నడ సినిమాలు, 23 మలయాళ సినిమాలు, 17 పంజాబీ సినిమాలకు సెంట్రల్ సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వలేదు. ఈ అన్ని సినిమాలు కూడా అతి శృంగారం మరియు అతి హింసాత్మక సీన్స్ ను కలిగి ఉన్నాయట. కొన్ని సినిమాలు మాత్రం మత విద్వేశాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని విడుదలకు నో చెప్పడం జరిగింది. 16 ఏళ్లలో ఇన్ని సినిమాలంటే అంతకు ముందు మరెన్నో ఆ సంఖ్య వేలల్లోనే ఉండవచ్చు.