Begin typing your search above and press return to search.
పద్మావతికి సర్టిఫికేట్.. కండిషన్స్ అప్లయ్
By: Tupaki Desk | 30 Dec 2017 11:03 AM GMTఈ ఏడాది బాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన పద్మావతి సినిమా రిలీజ్ కాకముందే ఎన్ని వివాదాలను రేపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాకు దర్శకత్వం వహించిన సంజయ్ లీలా బన్సాలీపై షూటింగ్ దశలోనే దాడులు జరిగాయి. ఆ తరువాత అతని తలను నరికేస్తామని చెప్పడం ఇక టైటిల్ రోల్ కి నటించిన దీపిక పదుకొనె కు కూడా హెచ్చరికలు జారీ చేయడం దేశంలో సంచలనంగా మారింది.
ఎంతో గొప్ప చరిత్ర కలిగిన రాణి పద్మావతిని అవమానించే విధంగా ఆ సినిమా ఉందని హిందూ కర్ణ సేన వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అయితే సినిమా రిలీజ్ కాకుండా నిలిచిపోయింది. సెన్సార్ పనులు కూడా జరగలేదు. అయితే ఫైనల్ గా కొన్ని మార్పులు చేర్పులు జరిపితే సెన్సార్ పనులను పూర్తిచేసుకోవచ్చని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ప్రతినిధులు కండిషన్స్ పెట్టారట. యు/ఎ ఇస్తారు కాని.. ఈ కండీషన్స్ అన్నీ పాటిస్తేనే సర్టిఫికేట్ చేతిలో పెడతారు.
ముఖ్యంగా పద్మావతి పేరులో మార్పులు చేయాలనీ సూచించారు. పద్మావతి అని కాకుండా పద్మావత్ అని సెట్ చేసుకోవచ్చని చెప్పారట. అంతే కాకుండా గూమర్ పాటలోని కొన్ని సీన్స్ ని మార్చమని ఇక సీన్స్ లలో కొన్ని ఎడిట్ చేస్తే బెటర్ అని సూచనలను అందించారట. ముఖ్యంగా సతీసహగమనం సీన్ ను హైలైట్ చేయొద్దని చెప్పారట. దీంతో చిత్ర యూనిట్ ఈ ఛాన్సును మిస్ చేసుకోవద్దని నిర్ణయం తీసుకుందని సమాచారం. మరి ఏ విధంగా సినిమాను రెడీ చేస్తారో చూడాలి.