Begin typing your search above and press return to search.

ఆవేశపడొద్దు.. సెన్సార్ వారే చేశారనలేం

By:  Tupaki Desk   |   16 Jun 2016 3:30 PM GMT
ఆవేశపడొద్దు.. సెన్సార్ వారే చేశారనలేం
X
'ఉడ్తా పంజాబ్‌' సినిమా లీకైపోయింది కాబట్టి.. ఆ పనిని సెన్సార్ బోర్డు వారే చేశారని చాలామంది ఆరోపించడం ఇప్పుడు మనం చూస్తున్నాం. అంటే మొన్నటివరకు సెన్సార్ బోర్డు వారు ఈ సినిమాకు 89 కట్లు ఇవ్వాలంటూ రచ్చ చేశారు కాబట్టి.. వారే ఈ సినిమాను లీక్‌ చేశారని సోషల్‌ మీడియాలో కూడా తెగ ఆరోపణలు వస్తున్నాయి. కాని అదంతా నిజమేనా? బాధ్యాతాయుతమైన సెన్సార్‌ బోర్డు సభ్యులు అలా చేస్తే.. వారి జీవితాలు ఏమైపోతాయి? పోలీసులు.. అపోజిషన్‌ పార్టీలు.. వారిని వదిలేస్తాయా?

అప్పట్లో తెలుగులో ''ఎవడు'' సినిమా వీడియో సాంగ్స్ రెండు లీకయ్యాయి. వాటి మీదన ''ఫర్‌ రామ్ చరణ్‌'' అని రాసి ఉంది. అంటే ఆ వీడియోలను రామ్‌ చరణ్‌ స్వయంగా లీక్‌ చేసినట్లేనా? కాదు కదా. ఇప్పుడు కూడా సెన్సార్‌ బోర్డు సభ్యులే రిలీజ్‌ చేశారని చెప్పలేం. ''ఫర్‌ సెన్సార్ బోర్డు'' అనే వాటర్ మార్క్ ఉండటంలో సెన్సార్ వారే లీక్‌ చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్రింట్‌ అనేది ఆన్ లైన్‌ లో శాటిలైట్‌ ద్వారా ప్లే అయ్యే పద్దతిలో సెన్సార్‌ వారికి స్ర్కీనింగ్ చేస్తారు. సో.. హార్డు డిస్కులో నుండి పెన్‌ డ్రైవ్‌ లోకి కాపీ చేసినంత ఈజీగా దీనిని కాపీ చేయలేం. సినిమా ప్రింటు హార్డు డిస్కుతో పాటు శాటిలైట్‌ ఎనక్రిప్షన్‌ లాక్‌ (కీ పాస్వర్డ్) కూడా కావాలి. అంటే ఎవరన్నా ఆన్ లైన్ లో సెన్సార్ వారి సెర్వర్ ను హ్యాక్‌ చేసి ఈ ప్రింటును కాపీ చేసి.. దానిని డీకోడ్‌ చేసి.. ఇలా ఆన్ లైన్ లో రీలీజ్ చేసుండాలి.

ప్రస్తుతం ఇదే విషయాన్ని ముంబయ్‌ సైబర్‌ క్రయిమ్‌ పోలీసులు వెరిఫై చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసి నిందితులను పట్టుకునే వరకు అసలు నిద్రపోను అంటున్నాడు దర్శకుడు అనురాగ్‌ కశ్యప్. మనోడే ఈ సినిమాను నిర్మించాడులే.